భూముల వల్లనే హైదరాబాద్ వివాదం?

గురువారం, సెప్టెంబర్ 29, 2011, 9:25 [IST]
Hyderabad
రాష్ట్ర విభజన విషయంలో హైదరాబాదు వివాదంగా మారడానికి, హైదరాబాదుపై సీమాంధ్రులు పట్టు వీడకపోవడానికి మరో కారణం కూడా కనిపిస్తోంది. ఈ కారణంపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. హైదరాబాదును అభివృద్ధి చేశాం కాబట్టి తాము హైదరాబాదుపై హక్కును వదులుకోవడానికి సిద్ధంగా లేమని సీమాంధ్ర రాజకీయ నాయకులు వాదిస్తున్నారు. హైటెక్ సిటీ వంటి అభివృద్ధి హైదరాబాదులో జరిగిన మాట వాస్తవమే. కానీ, విలీనానికి ముందు, విలీనం తర్వాత హైదరాబాదు అభివృద్ధి రేటులో తేడా లేదు. ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు హైదరాబాదు దేశంలోని నగరాల్లో ఐదో స్థానంలో ఉంది, ఇప్పుడూ అదే స్థానంలో ఉంది. విలీనం జరగడం వల్లనే హైదరాబాదు అభివృద్ధి చెందిందనే వాదనలో బహుశా పస లేకపోవచ్చు.

ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ విధానాల అమలు వేగవంతమైన తర్వాత, నిరర్థక ఆస్తుల అమ్మకం పేరుతో ప్రభుత్వ భూములను వేలం వేయడం పెంచిన తర్వాత హైదరాబాదు స్వరూప స్వభావాల్లో మార్చు వచ్చింది. హైదరాబాదు, హైదరాబాదు పరిసరాల్లోని స్థానికులు భూములు కోల్పోతూ వచ్చారు. సీమాంధ్ర రాజకీయ నాయకులు పెద్ద యెత్తున ఈ ప్రాంతాల్లో భూములు స్వాధీనం చేసుకున్నారు. బహుశా, డబ్బులు పెట్టే కొన్నారని కూడా అనుకోవచ్చు. అయితే, ప్రభుత్వ విధానాల్లోని వెసులుబాటును వాడుకుని తక్కువ ధరలకు కూడా చాలా మంది భూములు పొందారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, హైదరాబాదు ఇందులో ఉంటే ఆ భూములు మరోసారి వివాదంగా మారవచ్చు. తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఏర్పాటుతోనే ముగిసే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూములపై పోరాటాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. దాని వల్ల హైదరాబాదు, హైదరాబాదు పరిసరాల్లోని భూముల లెక్కలు తేల్చే పరిస్థితి రావచ్చు. ఎకరాల కొద్ది సొంత చేసుకున్న సీమాంధ్ర రాజకీయ నాయకుల భూములకు ఎసరు రావచ్చు. సీమాంధ్ర రాజకీయ నాయకులకు ఈ భయం ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.

విశాఖపట్నం, చిత్తూరు వంటి ప్రజలకు హైదరాబాదు అందుబాటులో లేదు. ఆ జిల్లాలకు చెందినవారు ఎంత మంది సామాన్య, పేద ప్రజలు హైదరాబాదును చూశారనే లెక్కలు తీస్తే ఆశ్చర్యకరమైన గణాంకాలే రావచ్చు. హైదరాబాదు పీటముడి సీమాంధ్ర ప్రజల వల్ల కాదు, రాజకీయ నాయకుల వల్లనే అనేది చెప్పకుండానే తెలిసే పరిస్థితి ఉంది.
English summary
Lands may be main aspect for becoming Hyderabad a hurdle to form Telangana state.
User Comments
ashok 09 Oct 2011 09:57 pm
అన్నాజీ, చరిత్ర చదువు మిడిమిడి గ్యనం తో మాట్లాడకు. బలవంతంగా తెలంగాణా ను కలుపుకోవడం పెద్దతప్పు . విడిపోదాం అంటే మే ప్రొబ్లెంస్ చెప్పండి, సాల్వ్ చేసుకొందాం.
ashok 09 Oct 2011 09:52 pm
ఒక్క భూముల ఆక్రమనే కాదు , రెడ్డి మరియు కమ్మ కుల పిచ్హి మరియు అహంకారం తెలంగాణా కు అన్మయం చేస్తున్నాయే
shiva 15 Oct 2011 11:56 am
తెలంగాణ సోదరులకు నా విన్నపము దయచేసి నా మాటలను కొంచం అర్ధం చేసుకోండి రాష్ట్రం విడిపోవడం ఈ సమస్యకు పరిష్కారం కాదు ఆంధ్రా వారు తెలంగాణ ను దోచుకున్నారు అనడం అర్ధరహితం కేవలం కొంతమమంది రాజకీయ నాయకులు మాత్రమే తమ అక్రమ సంపాదనలో భాగంగా తెలంగాణ వనరులను నాశనం చేసారు ఇది నిజమే కాని ఎటువంటి పరిస్థితి (దోచుకునే ) కేవలం తెలంగాణ లోనే కాదు దేశం అంత వుంది ఒక్క విషయం ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం ఆంధ్ర లేదా సీమ ప్రాంత ముక్యమంత్రి ఉండవచ్చు కాని తెలంగాణ లోని రాజకీయనాయకులు (m.ps,m.l.as) తెలంగాణ ప్రాంతం
Acharya 30 Sep 2011 04:49 pm
డియర్ నిశాంత్! ఎలాంటి వివాదాస్పద ఆర్టికల్స్ రాయవద్దు. సైబరాద్ అన్నిటికన్నా, శంసాద్ ఎయిర్ పోర్ట్ ఇంకా మిగాతా ప్రదేశాలు అభివృద్ధి సంగతి ఏమిటి? ఊరికనే ఏదో మాట చెప్పొద్దూ. ఆసియా లో ఎయిర్ పోర్ట్ కి గుర్తింపు ఉంది. రన్ వే ౧౬.౫ కిలోమీటర్లు పొడవు, పెద్దది ఐన టవర్ ఇంకా రోడ్లు తదితరాలు. గుర్తు పెట్టుకోవాలి. ఇంకెప్పుడు రాజకీయాలకు ముడి పెట్టవద్దు. ఉపాధి కొరకు హైదరాబాద్ లో ఉన్నవారి సంగతి ఏమిటి దానితో ఉన్న అనుబంధం సంగతి ఏమిటి. ఏదో కే సి ఆర్ లాంటి వాళ్ళకి మెప్పు కోసం మాట్లాడ వద్దు. ఇది వరకు ప్రత్యెక ఆంధ్ర
అన్నాజీ 29 Sep 2011 02:43 pm
అబద్దాల మీద నడిచే తెలంగాణా వితండ వాదుల మరో విశ్లేషణ. మొదటి అబద్దం.....హైదరాబాద్ అభివృద్ధి ఇతర పట్టణాలతో సమానం అనేది. వీలననికి పూర్వం ఎన్నాళ్ళు హైదరాబాద్ స్వతంత్రంగా ఉంది? ఆకాలంలో అభివృద్ధి ఎలా ఉంది అనే విషయం చెప్పరు. అభివృద్ధి ఎప్పటినుండి మొదలైంది? అభివృద్దిలో భాగస్వామ్యం ఎవరిదీ అనేదీ చెప్పరు. భూములు కొనేశారు అంటారు మరి తక్కువకు కాకపోతే మార్కెట్రేటుకి పదిరెట్లు పెట్టి ఎవరైనా కొంటారా? ఎకరాలు అమ్మి గజాలు కొన్నారు అని మాత్రం చెప్పరు. అమ్మిన సొమ్ము తో తాగి తందనాలు ఆడామని చెప్పరు.
[ మీ వ్యాఖ్య రాయండి ]
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST