విడిపోవటం తెలంగాన ప్రజల జన్మ హక్కు

సోమవారం, జూలై 11, 2011, 12:24 [IST]
Telangana
సమైక్యవాదాన్ని ప్రచారం చేస్తున్న లగడపాటి,రాయపాటి,బోయపాటి, ఇతర ఘనాపాటీలు, నేనిలు,టి.జిలు తదితరులు గమనించవలసింది, తెల్సుకోవాల్సింది ఏమిటంటె...సమైక్యత ఒక సామాజిక విలువ.. హక్కు కాదు. విడిపోవడం మాత్రం ఒక హక్కు. భార్యాభర్తలు, అన్నాదమ్ములు, జాతులు ఒక సమాఖ్యగా కల్సిఉండడం ఎప్పుడైనా ఒక విలువే తప్ప హక్కు కాదు. కల్సి ఉండటం ఇద్దరు లేదా కల్సి ఉండాలనుకునే వాల్లందరి పరస్పర అంగీకారం మేరకే జరుగుతుంది .జరగాలి కూడా. కాని అయిష్టంగా , బలవంతంగా కల్సి ఉండటం, కల్సిఉండాలనటం అప్రజాస్వామికం. పరస్పర అంగికారం లేని కాపురాలు, వ్యాపార భాగస్వామ్యాలు ,ఉమ్మడి కుటుంబాలు , జాతుల సమాఖ్యలు ఎన్నటికి నిలువజాలవు.

అన్యాయానికి, దోపిడికి, వివక్షకు గురి అవుతున్న భాగస్వామ్య పక్షాలు విడి పొయి స్వతంత్రంగా బతకాలనుకోవటం ప్రపంచమంతా అంగీకరించిన హక్కు. విడిపోయే హక్కును కల్సి ఉండాలన్న విలువతో అడ్డుకోవాలనుకోవటం హక్కుల భావనకే విరుద్దం. సీమాంధ్రులు కల్సి ఉండటాన్ని కూడా ఒక హక్కుగా భావించి సమైక్యతను తెలంగాన ప్రజల మీద రుద్దుతున్నారు.హక్కుల భావనకే కొత్త భాష్యం చెబుతున్నారు. సమైక్యత అనే విలువను ఎవరికి భోదించాలి? సమైక్యంగా ఉండాలనుకుంటున్న వాళ్లకా? విడిపోతమనుకుంటున్నవాళ్లకా? సమైక్యవాద ప్రచారం చేయవల్సింది విజయవాదలో,విశాఖలో,తిరుపతిలో, కర్నూలులో,కడపలో కాదు.వరంగల్,కరీంనగర్,నిజామాబాద్,ఆదిలాబాద్,మహబూబ్ నగర్,నల్లగొంద,మెదక్ తదితర తెలంగాన జిల్లాలలో, పట్నాలలో, గ్రామాలలో జరగాలి. తెలంగాణ ప్రజలు ఎప్పటినుంచో అడుగుతున్న ప్రశ్నలకు మౌనం వహించి , సమైక్య రాష్త్ర ఏర్పాటుకు ఉన్న అన్ని ప్రాదిపదికలను ద్వంసం చేసి ఇవ్వాల సమైక్యవాదం వర్ధిల్లాలి అంటె ఏం ప్రయోజనం? తెలంగానను అన్ని రంగాలలో దోపిడికి, అనిచివేతకు, వివక్షకు గురి చేసి ఇవ్వాల కలసి ఉంటె కలదు సుఖం అంటె నమ్మేదెవరు? 610 జీవోను, గిర్ గ్లాని సిఫారసులను అమలు చెయ్యమని ఉద్యమించే తెలంగాన ఉద్యోగులను అండమానుకు పంపాలన్న టిజి కి సమైక్య రాష్త్రం కోరుకునే అర్హత ఉందా?

దేశంలో రాష్ట్రాలు ఏర్పడటం కొత్త కాదు.14 రాష్ట్రాలుగా ఉన్న దేశం 28 రాష్ట్రాలుగా మారింది. రాష్ట్రాల సరిహద్దులు కూల్చలేని రాతి గోడలు కావు. 70 ఏండ్ల పాటు జాతుల సమాఖ్యగా కొనసాగిన సొవియట్ యూనియన్ విఛ్ఛిన్నమయి జాతులు దేశాలుగా అవతరించిన చరిత్ర ఇటీవలిదే. ఎటువంటి హింసకు తావు లేకుండానే ఈ దేశాల ఆవిర్భావం జరిగింది. జాతుల సమాఖ్యగా సోవియట్ యూనియన్ ఏర్పాటైనపుడు జాతులకు ఎపుడైనా సమాఖ్య నుండి విడిపోయే హక్కును కల్పించాడు లెనిన్. సోవియట్ యూనియన్ రాజ్యాంగంలో పొందుపర్చిన జాతుల స్వయంనిర్ణయాధికార హక్కు కారనంగా సోవియట్ యూనియన్ జాతి రాజ్యాలుగా విడిపోవడం సులువైంది. యుగోస్లావియాలో కూడా జరిగింది. జర్మన్ జాతిని రెండో ప్రపంచ సామ్రజ్యవాద యుద్ధం రెండుగా చీల్చింది. జర్మన్ ల ఏకీకరన కోసం రెండూ దేశాలలోని జర్మన్ లు పరితపించారు. తమకు అడ్డుగా ఉన్న బెర్లిన్ గోడను కూల్చి జర్మన్ లు ఐక్యమైనారు. ఈ ఏకీకరణ రెందు దేశాలలోని జర్మన్ ప్రజల పరస్పర అంగీకారం మేరకే జరిగింది తప్ప బలవంతంగా చేసిన ఏకీకరణ కాదు.

అదే విధంగా సోవియట్ యూనియన్ జాతుల సమాఖ్యగా ఏర్పడటం ప్రజల అంగీకారం మేరకే జరిగింది. సమాఖ్య నుండి విదిపొవాలనుకున్నపుడు ఒక హక్కుగా విడిపోయి జాతి రాజ్యాలుగా ఏర్పాటైనారు. ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి ఎన్నో ఉదాహరనలు చెప్పుకోవచ్చు.ఇక్కడ సారాంశం ఏమిటంటె సమైక్యత పరస్పర అంగీకారం అనే విలువ పునాదిగా ఏర్పడాలి. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అటువంటి సంపూర్న పరస్పర అంగీకారం మేరకు జరిగింది కాదని చరిత్రలోకి వెలితే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బేషరతుగా ఏర్పడింది కాదు. పెద్ద మనుషుల ఒప్పందం అనే షరతుల పునాదిగా ఏర్పడింది.కాబట్టి తమకు అన్యాయం జరిగింది అని తెలంగాణ ప్రజలు భావిస్తే విడి పోయే హక్కు వారికి ఉంటుంది. ఆనాటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ తెలంగాన ప్రజలకున్న ఈ హక్కును గుర్తించాడు కనుకనే 5 మార్చి 1956 న నిజామాబాద్ లో విలీన ప్రకటన చేసినపుడు ... భవిషత్తులో తెలంగాణ ప్రజలు ఎప్పుడు కోరుకుంటె అప్పుడు విడిపోవచ్చునని ప్రకటించాడు. ఆయితే ప్రపంచమంతా గుర్తించిన విడిపోయే హక్కును సీమాంధ్ర సమైక్యవాదులు మాత్రం గుర్తించడం లేదు. పైగా సమక్యవాదమనే ఒక విలువని హక్కుగా గుర్తించమంటున్నారు. హక్కుల భావనకే కొత్త భాష్యం చెబుతున్నారు. ఇవ్వాల తెలంగానలో సమైక్యవాదం సమూలంగా నాశనం అయింది. అయినా సమైక్యవాదులు తమ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం ఆంధ్తప్రదేశ్ కొనసాగాలని కుట్రలు పన్నుతున్నారు.

1948 వరకు తెలంగాన ఒక దేశం. ఆ తర్వాత భారత దేశంలో ఒక రాష్ట్రమైంది.తెలంగాన ప్రజలు భారత జాతిలో స్వచందంగా ఇక్యమైనారు.1956 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైంది. అప్పటి నుండి ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో తెలంగాన ప్రజలకు భావసమైక్యత ఏర్పడలేదు. సీమాంధ్ర పలక వర్గాలు ఇందుకు ఏ క్రుషి చెయ్యలేదు. సాంస్క్రుతిక రంగంలోనూ అటువంటి క్రుషిలో సీమాంధ్ర మేధావి వర్గాలు దూరంగా ఉన్నాయి. నిర్లిప్తంగా ఉండిపోయాయి. ఇవ్వాల తెలంగాన - ఆంధ్ర సమాజాలు నిట్ట నిలువునా చీలిపోయిన స్థితిలో ఇంకా సీమాంధ్ర పెట్టుబడిదారి వర్గాలు సమైక్యవాదాన్ని పట్టుకుని,చూరుకు వేల్లాడే గబ్బిలాల మాదిరి , వేలాడడం శోచనీయం.మానసికంగా విడిపోయిన తెలంగాన ప్రజలు ఇక ఆంధ్రప్రడెశ్ అనే రాష్ట్రంతో భావసమైక్యత సాధించడం దుర్లభం. ఇక బౌతిక విభజన ద్వారా తెలంగాన ప్రజల భారత జాతీయతా భావనను కాపాడుకోవాల్సిన కర్తవ్యం భారత పాలకవర్గాలదే." కుండల్లగా విడిపోదాం కావడిలా కల్సిందాం " అని అంటున్న సీమాంధ్ర దలిత బహుజన మేధావుల మాటను సీమంధ్ర ప్రజలు ఎత్తి పట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజల మధ్య విధ్వేషాలు వైషమ్యాలు రేకెత్తించే వారిని ఎండగట్టాల్సిన భాధ్యత సీమాంధ్ర ప్రజలది, మేధావులది, ప్రజాస్వామ్యవాదులది.

- శ్రీధరరావు దేశ్‌పాండే

రచయిత అభిప్రాయాలతో దట్స్ తెలుగుకు ఏ విధమైన సంబంధం లేదు. ఈ వ్యాసంపై చర్చలో కూడా పాల్గొనవచ్చు.
English summary
Writer Sridhar rao Deshpande expressed his opinion that it is the right of Telangana people to divide.
User Comments
Narasimha Thota 30 Dec 2011 04:59 am
aa taagubothu KCR gaadiki USSR gurinchi cheppakandi. Ippudu telangana separate state kosam poru apesi, telangana separate country kaavalani prajalani recchakottuthadu. Vidipovadam hakke. kaani deshamlo vunna manchi place lanni mave (hyderabad maade) ani anadam mathram navvukodagga vishayam. Telangana valle antunnaru kadaa, seemandrulu vacchi occupy chesukunnaru hyderabad nu, anni businesslu vallave ani. Alantappudu, adi develop chesukunnavallaku chendali kada.
Teluguvadu 15 Nov 2011 02:33 pm
Very nice one but meere chepparu vidi povadam anedi iddari angeekaram thoti oppandam thoti jaragalani kani ippudu jaruguthunna parinamalu evari aangeekaram kosamo oppandam kosamo jaragatam idi badakaram. Vidipovadama kalisiundatama kanna em chesthe dani after effects enti ane alochanalo yevaru leru madi maku kavali ani okaru enduku miku kavali ani inkokaru anthe thappa samasya mida iddram alochinchadam ledu
Indian 10 Nov 2011 11:38 pm
vigrahalu pagala gottadam dharnala perutho rowdilala behave cheyyadam pillala chaduvulu paadavuthaayi ani thelisinaa herolala bundlu cheyyadam kuuda mana hakku
TDP fan 15 Aug 2008 10:26 pm
Ore nee, anta seenu unda CBN ki, if see MEE KOSAM, there no public at all.People are believeing him.Do not dream about it.CBN era is over he is fast.Who ever joing with him such as Communist and other will be totallu.Next CM will be either Chiru or YSR.CBN do not have that face value.No good leader in TDP.Nagam, Kodela vella TDP ni gelipinchedi.Eee vennupotu cheateriki evvaru votu veyyaru.
mr.konda konda 12 Jul 2011 09:01 am
కెవ్వు కేక , తెలంగాణా వచ్హాక కూడా ఇవే మాటల మీద నిలబడితే ...కెవ్వు కేక.....కేక
mr.konda konda 12 Jul 2011 08:32 am
వద్దు భయ్యా ఇలాంటి స్టేట్మెంట్స్ మనం ఇస్తే ' మీ తో కలసి మెలసి ఉండడం మా హక్కు ' అని కోస్తా రాయలసేమ వాళ్ళు అంటారు .
Satyanarayana NVS 11 Jul 2011 08:12 pm
హలో కే.స.కిరణ్ గారు,మీకు తెలంగాణా కావాలని అడగండి,తప్పు లేదు,కాని ప్రక్కన వాళ్ళని తక్కువగా,దొంగలుగా,ద్రోహులుగా చేసి మాట్లాడడం బాగా లేదు.మీ ప్రాంత అభిప్రాయం మీరు చెప్పినట్లే మిగతా ప్రజల అభిప్రాయం చెబితే తప్పా?ఎక్కడైనా ఎవరి కస్టాలు బాధలు వాళ్లకు వుంటై,మీరొక్కరే తెలంగాణా కోసం కంకణం కట్టుకున్నట్లు మిగిలిన వాళ్ళను తిట్టవద్దు,మిగిలిన వాళ్ళు మిమ్ములని తిడితే మీరు వాళ్ళను తిట్టండి అంటే గాని అందరిని తిడితే బాగుండదు కదా !
jay jay 11 Jul 2011 06:08 pm
haha andhra vaadu baagu paduthunnadani nuvvu kooda yedusthunnav gaa kskirankumar..
Raj Madiga 11 Jul 2011 04:40 pm
Hello All, Please notice that the leaders of Students, Political, and Media people who are raised the state separation they are all from Non Telugu Origin people. See his name? So don't believe his words. I believe that KCR is trying push back to the patel culture in this region. The population wise we are more in this region so if state separation happened this should belongs to ours. Jai Madiga. Jai Madiga Rastram
kiran kumar 11 Jul 2011 05:38 pm
Well Said..... but for that u r leadership shuld b strengthen.. so, u shuld b united.. no devision between mala and madiga.. upper caste people deviding u in this regard.. please b united
krishna 01 Nov 2011 01:45 am
మొదలు తెలంగాణా గురించి తెలుసుకో తరువాత తెలంగాణా వారి గురించి అప్పుడు తెలుస్తుంది ఐనా నీలాంటి బేవార్స్ నకోడుకులకు ఎందుకిలోల్లి !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!౧
Narasimha Thota 30 Dec 2011 05:03 am
Pakistan vidipoyinatluga mee mala, maadigalandaroo vidipoti prathyeka desham gaa erpadithe bharatha deshaniki pattina daridram vadilipothundi. Jai madiga desham. Jai Jai madiga desham.
Srinivas G 11 Jul 2011 04:36 pm
manalo manam ila kotukunte pakka rastalu manaku gati poti iche tamil,maharastra,karnataka valu advantage teskuntunaru.chala companies vere stattes ki veli poyayi.
kskirankumar 11 Jul 2011 05:48 pm
అంటే వేరే ఎవడో బాగుపడుతడని కుల్లుకొని, అల జరగకుండా మీ సీమండ్రుల దోపిడిని తెలంగాణా బరించాలని అంటావు, అంటే కదా, ఛి మనిసి పుట్టుక పుట్టవా నువ్వు ?
Srinivas G 12 Jul 2011 09:36 am
nuvaasalu manishivena nenu antunadi enti nuvu matladutundi enti nuvasalu manishiva KCR va ? evadu ra ne telangana ni dochukunaru. okka hyderabad lo ne vachi andaru settle ayaru kani meku batakatam cheta kaka eduta vallla meda dumu poyaku. bosudk antam kadu ra ala behave cheyakunda undali ra.
Srinivas G 12 Jul 2011 09:47 am
nuvu oka ammaki abbaki putti unte ne bhasha ni sariga vadu. puttaledu ani oppuko iddaram ishtam vachinatu bhoothulu matladukundam. sarena ? eduta varitho ela matladukovalo nerchuko first. ne matalatho nee character ento ardam autundi.
Srinivas G 12 Jul 2011 09:48 am
so ikkada nunchi nuvu sarina bhasha vadaledanuko nuvu OKA AMMA KI ABBA KI puttaledani ardam. so language sariga rani ne noti nunchi ardam ainda
Srinivas G 11 Jul 2011 04:33 pm
ila evaru padite valu pratyeka rastram adigite istu pote okapudu 14,28 ye undevi, kaani tarvata 5000 rashtralu autai. apudu chala abhivridi chedochu. jharkand emindo telida.inko madu koda unadu me telangalo kcr. meru kalu teravandi. anavasaram ga nindinchatam kadu.nijalu telusukondi.politician valla chetullo keelu bomalu ga mari anavasram ga career ni padu cheskokandi
kskirankumar 11 Jul 2011 05:49 pm
ఈ బుడ్డి మీకు మద్రాసు నుండి విడిపోయే ముందు ఎందుకు లేదో? 1972 ఉద్యమ చేసేటప్పుడు ఎందుకు లేదో ... ఆ ఎప్పుడు అర్థం అయ్యింది. నువ్వు చేస్తే శృంగారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం .. అంతే కదా.
[ మీ వ్యాఖ్య రాయండి ]
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST