వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవిత్ర ప్రేమను చాటిచెప్పే ‘రాఖీ పౌర్ణమి’...!!

|
Google Oneindia TeluguNews

Raksha Bandhan
మానవీయ సంబంధాలను పటిష్టం చేస్తూ.. సోదర ప్రేమకు ప్రతిరూపంగా నిలిచే 'రక్షా బంధన్" సంప్రాదాయబద్ధమైన మన విలువలను మరింత ఉట్టిపడేలా చేస్తుంది. ఉన్మాదత్వం, విచక్షనా వంటి వెకిలి చేష్టలు పేట్రేగి, మనవతా విలువులు మంటగలుస్తున్న ప్రస్తుత ఆధునిక యుగంలో 'రాఖీ పౌర్ణమి" తన విశిష్టతను చాటిచెబుతూ సోదర ప్రేమ పటిష్టతకు దోహదపడుతుంది. సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమిని శనివారం ఘనంగా జరుపుకోనున్నారు.

కేవలం అన్నాచెల్లెళ్లు .. అక్కాతమ్ముళ్లకే రక్షాబంధన్ పరిమితం కాదు స్నేహానికి ఈ బంధనం ప్రతీకగా నిలస్తుంది. విలువలతో కూడిన ప్రేమను ఆస్వాదించే వారు ఎవరైనా సరే రాఖీ వేడుకల్లో మునిగితేలాల్సిందే.

ప్రతి ఏటా శ్రావణమాసంలో వచ్చే రాఖీ పర్వదినాన్ని కులమతాలకు అతీతంగా మన రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే పండుగ కాబట్టి ఈ పండుగను శ్రావణ పౌర్ణమిగా మరి కొందరు రాఖీ పౌర్ణమిగా పిలుస్తారు. కేరళ, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో '' ఆవని ఆవిట్టం"", బిహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లో '' కజరి పూర్ణిమ""గా రక్షాబంధన్‌ని నిర్వహిస్తారు. గోవా, కర్నాటక, గుజరాత్, మహారాష్ట్రాల్లో ఈ పండుగతోనే కొత్త రుతవు ప్రారంభమైనట్లు అక్కడ ప్రజలు భావిస్తారు.

రాఖీ వెనుక ఎన్నో పురాణ కథలున్నాయి. ఇప్పుడు రాఖీలు అన్నా చెల్లెళ్లు కట్టకుంటున్నారు. కాని తొలత రాఖీ ఓ భార్య భర్తకు కట్టిందని పురాణాలు చెబుతున్నాయి. రాక్షసులకు, దేవతలకు మధ్య బీకరపోరు జరిగింది. ఈ పోరులో రాక్షసుల పరాక్రమాన్ని చూసి తన రాజ్యాన్ని కోల్పోతానేమోనని దేవతల రాజు దేవేంద్రుడు భయాందోళణకు గురై యుద్ధానికి వెళ్లకండా ఇంట్లోనే ఉండిపోతాడు. తన భర్త విజయం సాధించాలని భార్య శుచీదేవి ఇంద్రుడిని పూజించిన ఒక ధారాన్ని చేతికి కడుతుంది. దింతో ఇంద్రుడు విజయం సాధిస్తాడు. ఇలా అనేక కథనాలున్నాయి. ఆత్మీయ బంధాలను గాలికోదిలేస్తున్న ప్రస్తుత కాలంలో బ్రిటన్, నేపాల్, కెనడా తదితర దేశాల్లో రాఖీ పౌర్ణమిని జరుపుకుంటున్నారు.

రాఖీపండుగ వచ్చిందంటే ఇళ్లంతా సందడి, సందడిగా ఉంటుంది. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా అన్ని వయస్సుల వారు రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటారు. రాఖీపౌర్ణమిని
పురస్కరించుకుని మార్కెట్లో రకరకాల రాఖీలు మనకు దర్శనమిస్తాయి. గతంలో కంటే భిన్నంగా ఈ సారి సృజనాత్మకతతో కూడిన రాఖీలు మార్కెట్లోకి వచ్చాయి. సాధారణ రాఖీలు రూ.5 నుంచి రూ. 60 వరకు లభిస్తుండగా, ముత్యాలు, రాళ్లు పొదిగిన రాఖీలు మాత్రం రూ.100 నుంచి రూ.1000 వరకు పలుకుతున్నాయి.

English summary
They say traditions alter as the years pass by. The symbolic 'Rakhi', according to tradition is tied around a brother's wrist. However, now a days, members of a family tie the 'Rakhi' around each other's wrists to express their love and affection. Hindus tie the Rakhi around the idol of Lord Ganesha to seek the blessings of his bounty. According to legends, the Gods who were losing a battle to the demons approached Lord Vishnu for help. Lord Vishnu advised them to ask their female relatives to tie a protective band around their wrists. In fact, Lord Indhra's wife Sachi too tied a Rakhi around her husband's wrist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X