వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెంపుడు కుక్కతో ఆటలు కూడా కొద్దిపాటి యోగాతో సమానమే!

By B N Sharma
|
Google Oneindia TeluguNews

Yoga with your pet
న్యూయార్క్: యోగా ఆధునిక కాలంలో అనేక రూపాలలో అవతరించింది. పెంపుడు కుక్కను భాగస్వామి చేసుకొని బీచ్ లో ఆటలాడటం, దానితో కలసి వివిధ భంగిమలలో యోగా ప్రదర్శించటం యోగాకు మరో పేరైన 'డోగా" అంటోంది ఫ్లారిడా కు చెందిన యోగా బోధకురాలు సూజి టీటల్ మన్. డాగ్ తో కలిసి చేసేదే డోగా అంటోంది. 2002 నుండి ఈమె డోగాను అనేకమందికి బోధిస్తోంది కూడాను. దీనిపై తరగతులు, డివిడిలు, ఒక ట్రైనింగ్ మేన్యువల్ కూడా తయారు చేసింది. ఇప్పటికి సుమారు ప్రపంచ వ్యాప్తంగా వందమందికి శిక్షణ ఇచ్చిందట. వారిలో కొంతమంది చైనా, జపాన్ దేశాల వారు కూడా ఉన్నారట.

డిస్కో యోగా, కిడ్ యోగా, బీచ్ యోగా, స్పిన్ యోగా, ఇవన్నీ కూడా యోగా నుండి పుట్టినవే. అన్నీ కూడా ఉదయించే సూర్యుడికి అభినందనలు తెలిపేవే అంటోంది. 50 వేల సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేయబడుతున్న శారీరక కదలికలు, శ్వాస ల అను సంధానమే యోగాగా ఈమె చెపుతోంది. డాగ్ తో కలసి వైబ్రేషన్స్ కొరకు మొదటగా ఛాంటింగ్ చేయడం, తర్వాతి అంశంగా దానితో కలసి శరీరాన్ని వంపు సొంపులు తిప్పటం డోగా గా ఆమె వివరిస్తోంది.

యోగా కానీ లేదా డోగా కానీ పేరు ఏదైనప్పటికి, చేసే వారికి ఆసక్తి పుట్టించి బాడీ, మైండ్, సోల్ లను ఏకం చేసి అనుకున్న ఫలితాలను సాధించటమే ప్రధానం కదా !

English summary
Teitle man stumbled upon doga because her dog liked to lie under her while she practiced. When you feel good, they feel good she said. They want to be around your goodness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X