హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కేసులో అరెస్టైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి జైలులో సాధారణంగా ఉంటూ జైలు అధికారుల మన్ననలు పొందుతున్నారట. చంచల్‌గూడ మహిళా జైలులో ఉన్న ఆమె ఖైదీల పట్ల, జైలు అధికారుల పట్ల వినయ విదేయతలతో, మర్యాద పూర్వరంగా మసలుకుంటున్నారు. ఆమెను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక సౌకర్యాలు వినియోగించుకునే అవకాశమున్నప్పటికీ పూర్తిగా ఏవీ ఉపయోగించుకోవడం లేదు. అధికారులను ప్రత్యేకంగా ఏమీ కోరటం లేదు. ఆమె జైలు జీవితం నెల రోజులు పూర్తయింది. గత జనవరి 6వ తేదిన కోర్టు ఆమె బెయిల్‌ను రద్దు చేయడంతో సిబిఐ ఎదుట లొంగిపోయారు. అప్పటి నుండి ఆమె జైలు జీవితం వరుసగా గడుపుతున్నారు. ఆమెను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని జనవరి 25న కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా ఆమె అలాంటి ప్రత్యేక అధికారాలు పూర్తిగా ఉపయోగించుకోవడం లేదు.
జైలు అధికారుల్లో తన కన్నా ఎక్కువ వయస్సు ఉన్న వారిని శ్రీలక్ష్మి అమ్మా అని సంభోదిస్తున్నారు. ప్రధానంగా ప్రత్యేకంగా తనకు ఇష్టమైన వంట చేయించుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ఆమె దానిని ఉపయోగించుకోవడం లేదు. అంతకుముందు ఆమె జైలుకు వచ్చినప్పటికీ, ఇప్పటికీ తేడా కనిపిస్తోందట. అంతేకాదు తన భర్త, ఐపిఎస్ అధికారి గోపి కృష్ణను తప్ప ఆమె ఎవరిని కలిసేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఆమె భర్త ఆమెకు జైలులో చదువుకునేందుకు పుస్తకాలు, తినేందుకు పళ్లు తీసుకు వస్తున్నారు. జైలు నిబంధనల ప్రకారం వారంలో రెండు సార్లు మాత్రమే కలిసేందుకు అవకాశముంది.
అంతేకాదు ఆమె తనకు వచ్చే లెటర్స్, మెయిల్స్ కూడా తిరస్కరిస్తోందట. ఒకరు పంపిన పోస్టు కార్డు, ఓ స్వామీజీ పంపిన రిజిస్టర్ మెయిల్స్‌ను ఆమె తిరస్కరించడంతో వాటిని తిప్పి పంపించారు. జైలు అమౌంటులో ఆమె డబ్బులు నిల్. కొందరు క్యాంటీన్‌లో తినేందుకు కొంత డబ్బును తెచ్చుకుంటారు. అది జైలు ట్రెజరీలో ఉంటుంది. కానీ శ్రీలక్ష్మి అకౌంట్ మాత్రం నిల్. ఎమ్మార్ కేసులో అరెస్టైన బిపి ఆచార్య కూడా ఎలాంటి డబ్బులు తన వెంట తెచ్చుకోలేదు. జైలులో ఆమె సాధారణంగా ఉండటం చూస్తుంటే నిర్వేదంగా ఉన్నట్లు కనిపిస్తోంది.