వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంబరాల సంక్రాంతి ….....తెచ్చింది విశ్రాంతి !

By B N Sharma
|
Google Oneindia TeluguNews

The importance of Sankranthi festival
సంక్రాంతి పండుగ ఎపుడు ? ఈ నెల 14 వ తేది సోమవారం... అలసి సొలసిన హై టెక్ నగర జీవులకు నాలుగు రోజుల పాటు ఎంతో విశ్రాంతిని తెచ్చింది. ఈ పండుగకు చాలా మంది నగర వాసులు గ్రామీణ ప్రాంతాలలోని తమ ఇండ్లకు వెళ్లి కుటుంబ సభ్యుల కలయిక లో బాగా ఆనందిస్తారు. ఎంత హై టెక్ జీవనాలు సాగించినప్పటికి, పండుగ ప్రత్యేకతలు నాటికి నేటికి...గంగిరెద్దులు, హరిదాసులు, ఇంటి ముంగిట రంగుల ముగ్గులు, మామిడి తోరణాలు, చెరుకు గడలు, పిండివంటలు, సూర్యుడు కి నైవేద్యం చేసిన కొత్త బియ్యపు పొంగలి అన్నీ కొనసాగుతూనే వున్నాయి.

పచ్చని ప్రదేశాలతో, ఆహార ధాన్యాల ఉత్పత్తి లో దేశానికి వెన్నెముకగా, అన్నపూర్ణ గా ఖ్యాతి గాంచిన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ వాతావరణం సంక్రాంతి పండుగ సమయంలో ఒక అద్భుత దృశ్యం. వాస్తవం లో ఈ పండుగను నగర వాసులు అనుభవించక పోయినా, బాపు, రమణ ల వంటి గొప్ప వ్యక్తులు మన తెలుగు సంక్రాంతి సంబరాలను, సంప్రదాయాలను ప్రతిబింబించేలా చిత్రీకరించిన సినీ ఘట్టాలను చూసి ఆనందించని వారుండరు. ఆంధ్ర రాష్ట్రం లో నాలుగు రోజుల పాటు ఈ పండుగను చేస్తారు. అవి ...మొదటి రోజు 'భోగి', రెండవ రోజు 'మకర సంక్రాంతి ' (ఇది అసలైన పండుగ రోజు) మూడవ రోజు 'కనుమ', చివరి రోజు లేదా నాల్గవ రోజు 'ముక్కనుమ' గా చెపుతారు.

భోగి రోజున కుటుంబం లోని పెద్దలూ పిల్లలూ అందరూ కలసి ఉదయం వేళ కొయ్య దుంగలతో రోడ్లపై భోగి మంటలు వేస్తారు. తమ తమ ఇండ్లలోని, పనికిరాని పాత చెక్క వస్తువులను, ఇతర వస్తువులను మంటలలో పడవేసి, పనికిరాని పాతకు స్వస్తి చెప్పి కొత్త దనాన్ని కోరతారు. ఈ చర్య పాత చెడు అలవాట్లని మాని కొత్త మంచి అలవాట్లని చేసుకోవాలని కూడా సూచిస్తుంది.

చాలా కుటుంబాలలో శిశువులకు, పిల్లలకు అంటే సాధారణంగా, మూడు సంవత్సరాల వయసు లోపు వారికి ఒక సాయంకాల వేడుకగా రేగిపండ్లు, పూవులు, చిల్లర నాణేలు కలిపి వారి తలపై పోసి ఆనందిస్తారు. దీనినే భోగి పండ్లు పోయటం అంటారు. రుచికరమైన తీపి పదార్థాలు తయారు చేసి అందరికి పంచుతారు. కుటుంబం లోని సభ్యులు ఎవరెవరు ఎక్కడ ఉన్నప్పటికీ, ఈ పండుగనాడు ఒకే చోట కలసి ఆనందిస్తారు. సోదరులు లేదా, తల్లి తండ్రులు, వివాహం అయిన తమ ఇంటి ఆడ పిల్లలని పండుగకు పిలిచి వారికి బట్టలు, ఇతర బహుమానాలు పంచి వారి ప్రేమాప్యాయ తలను చాటుకుంటారు. ఇంటి లేదా, దుకాణాల, ఇతర ప్రైవేటు సంస్థల యజమానులు తమ సిబ్బంది కి బోనస్ గా కొంత సొమ్ము లేదా, బట్టలు వంటివి పంచి వారిని ఆనందింప చేస్తారు.

రెండవ రోజు మకర సంక్రాంతి లేదా ' పెద్ద పండుగ'. అంటే ఇది పండుగలలో అన్నిటికంటే పెద్ద పండుగ అని అర్ధం. ఈ రోజు అందరూ కొత్త దుస్తులు ధరిస్తారు, దేముని పూజిస్తారు, ఈ రోజున సూర్యుడు మకర రాశి లో ప్రవేశిస్తాడు. కనుక దీనిని మకర సంక్రమణం అని కూడా అంటారు. మరణించిన తమ పూర్వీకులకు సాంప్రదాయకంగా కొన్ని కర్మలను ఆచరిస్తారు. ఇంటిలో తయారు చేసిన పిండి వంటలతో కుటుంబ సభ్యులు అందరూ కలసి భోజనాలు చేస్తారు.

మకర సంక్రాంతి పండుగ మూడవ రోజున, పశు పక్ష్యాదులను లను గుర్తు చేసుకుంటూ ప్రత్యేకించి ఆవులను, ఎద్దులను పూజిస్తారు. దీనిని కనుమ పండుగ లేదా పశువుల పండుగ అని కూడా అంటారు. ఈ రోజున ప్రయాణించటం ఆశుభంగా భావిస్తారు. ఈ రకంగా సంక్రాంతి పండుగలో తమ సంప్రదాయ, సాంస్కృతిక విలువలు ప్రదర్శిస్తూ కొత్త మార్పులని ఆచరిస్తారు. గురువులు, తమ శిష్యులను ఆశీర్వదిస్తారు. ఇంటి పెద్ద కుటుంబంలోని సభ్యులకు దుస్తులు అందించి ఆశీర్వదిస్తారు.
సంక్రాంతి పండుగ నాల్గవ రోజు ను 'ముక్కనుమ' అంటారు. సంక్రాంతి పండుగ మొదటి మూడు రోజులు కోస్తా ఆంధ్ర ప్రాంతం లోని ప్రజలు మాంసం లేదా చేపలు వంటి ఆహారాలు తినరు. కాని మూడవ రోజు అయిన కనుమనాడు మామ్సాహారాలను అధికంగా తింటారు. తెలంగాణా ప్రాంతం లో ఈ పండుగ రెండు రోజులు మాత్రమే చేస్తారు. వీరు మొదటి రోజు నువ్వుల తో కలిపి వండిన అన్నాన్ని తిని, రెండవ రోజు అయిన పండుగనాడు మాంసం తింటారు. ఈ పండుగకు అన్ని కుటుంబాలు అరిసెలు, అప్పాలు వంటి పిండి వంటలు చేసి దేముడికి నైవేద్యం చేసి వారు తింటారు.

ఈ పండుగకు దక్షిణ దేశపు ఆటలు అయిన కోడి పందేలు, ఆంధ్ర కోస్తా జిల్లాలలో ఆడగా, తమిళనాడు రాష్ట్రం లో ఎద్దుల పందేలు, కేరళ లో ఏనుగుల మేళా నిర్వహిస్తారు. ఈ పందేలలో చట్టబద్ధం కానప్పటికీ అధిక మొత్తాలలో పందేలు కాయటం ఈ ప్రాంతాలలో ఆనవాయతీగా వస్తోంది.

ఈ పండుగ మరో ప్రత్యేకత పండుగ ఇంకా నెల రోజులు వున్నదనగానే, ప్రతి రోజూ ఉదయం వేళ రంగుల దుస్తులు ధరించి హరిదాసులు, గంగిరెద్దులు ప్రతి ఇంటి ముందుకు తెచ్చి ఇంటి వారికి ఆశీర్వాదాలు ఇచ్చి సొమ్ము అడుగుతారు.

ఈ పండుగకు హైదరాబాద్, తెలంగాణ జిల్లాలలో పిల్లలు, పెద్దలు కలసి రంగు రంగుల గాలి పటాలు తమ భావనాలపైకి ఎక్కి ఎగుర వేసి ఆనందిస్తారు. ఆంద్ర దేశం తో పాటు, పొరుగునే కల కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా ఈ పండుగను పొంగల్ పేరుతో ఆచరిస్తాయి.

ఈ పండుగ రోజున ఉదయం వేళ ప్రతి ఇంట్లో ఈ సంవత్సరంలో కొత్త గా తాము పొందిన పంటలోని బియ్యాన్ని ఎంతో కృతజ్ఞతగా వండి పొంగలి తయారు చేసి సూర్యుడు కి నైవేద్యం చేసి తాము తింటారు. దక్షిణ భారత దేశం లో ఇది పెద్ద పండుగలలో ఒకటి. ఇండ్లను పూవులతో, రంగు రంగుల ముగ్గులతో అలంకరిస్తారు. కుటుంబం లో ప్రతి ఒక్కరూ కొత్త దుస్తులు ధరించి ఆనందిస్తారు.
తమిళనాడు రాష్ట్రం లో పొంగల్ పండుగ మరియు, వారి కొత్త సంవత్సరం ఒకే రోజున వస్తాయి. మకర సంక్రాంతి పండుగను ఉత్తర భారత దేశం మరియు, మరికొన్ని ఇతర భాగాలలో లోరీ, బిహు, హడగా, పొకి మొదలైన పేర్లతో పంట కోతల పండుగ గా చేస్తారు.

మరి ఇంత చేటు ఆనందోత్సాహాలను కలిగించి అందరికి ఎంతో మార్పు ఇస్తూ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ పండుగను తప్పక ఆచరిద్దాం, ఆనందాల హేలను పలికిద్దాం.

English summary
Sankranthi is an important for Telugu people. It will be celebrated three days. Animals will be worshiped on third day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X