హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒలింపిక్ డే రన్: అశ్వినీ నాచప్ప జ్యోతి (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 28వ ఒలింపిక్ డే నర్ - 2014 హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ధూంధాంగా జరిగింది. వివిధ ప్రాంతాల్లో విద్యార్థులు, క్రీడాకారులు ఉత్సాహంగా ఈ రన్‌లో పాల్గొన్నారు. చాదర్‌ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్‌ నుంచి ఎల్బీ స్టేడియం వరకు నిర్వహించిన ఈ రన్‌లో ప్రముఖ క్రీడాకారిణి, మాజీ ఒలింపియన్ అశ్వనీ నాచప్ప ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఎల్బీ స్టేడియం వద్ద క్రీడాకారుల నుంచి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ క్రీడాజ్యోతిని అందుకుని శుభాకాంక్షలు తెలిపారు. ముగింపు కార్యక్రమంలో ఆయనతో పాటు తెలంగాణ హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి కూడా పాల్గొన్నారు.

ఒలింపిక్ డే పరుగు చైర్మన్, పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు పాపారావు ప్రసంగించారు. అశ్వీనీ నాచప్ప సందేశం ఇచ్చారు. ప్రాథమిక విద్య స్థాయి నుంచే పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని ఆమె అన్నారు.

అంబేడ్కర్ విగ్రహం వద్ద..

అంబేడ్కర్ విగ్రహం వద్ద..

ఓలింపిక్ డే పరుగు హైదరాబాదులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఇలా కనిపించింది. విక్టరీ ప్లే గ్రౌండ్ నుంచి ప్రారంభమైన పరుగు ఎల్బీ స్టేడియానికి చేరుకుంది.

క్రీడాజ్యోతితో ఇలా..

క్రీడాజ్యోతితో ఇలా..

క్రీడాజ్యోతితో పలువురు క్రీడాకారులు, విద్యార్థులు అంబేడ్కర్ విగ్రహం వద్ద పరుగు తీస్తూ ఇలా కనిపించారు.

క్రీడాజ్యోతిని అందుకున్న ఉప ముఖ్యమంత్రి

క్రీడాజ్యోతిని అందుకున్న ఉప ముఖ్యమంత్రి

ఎల్బీ స్టేడియం వద్ద క్రీడాజ్యోతిని ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ అందుకున్నారు. జీతేందర్ రెడ్డి తదితరులను కూడా చూడవచ్చు.

చారిత్రక చార్మినార్ వద్ద

చారిత్రక చార్మినార్ వద్ద

చారిత్రక నగరమైన హైదరాబాద్‌కు సంకేతంగా నిలిచే చార్మినార్ వద్ద క్రీడాజ్యోతితో ఇలా కనిపించారు.

జాతీయ పతాక రెపరెపలు

జాతీయ పతాక రెపరెపలు

ఒలింపిక్ డే రన్ కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు క్రీడాజ్యోతితో ఇలా కనిపించారు. ఈ సందర్భంగా భారత జతీయ పతాక రెపరెపలాడింది.

ముస్లిం యువతులు కూడా..

ముస్లిం యువతులు కూడా..

ఒలింపికే డే రన్ కార్యక్రమం సందర్భంగా క్రీడాజ్యోతిని పట్టుకున్న ముస్లిం యువతులను చార్మినార్ వద్ద చూడవచ్చు.

విద్యార్థులు ఇలా...

విద్యార్థులు ఇలా...

హైదరాబాదులో సోమవారం జరిగిన ఒలింపిక్ డే రన్ సందర్భంగా విద్యార్థులు క్రీడాజ్యోతితో ఉత్సాహంగా ఇలా..

జింఖానా మైదానంలో..

జింఖానా మైదానంలో..

జింఖానా మైదానంలో క్రీడాజ్యోతితో ఇలా సందడి... పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముగింపు కార్యక్రమంలో..

ముగింపు కార్యక్రమంలో..

ఒలింపిక్ డే రన్ ముగింపు కార్యక్రమంలో ఎల్బీ స్టేడియం వద్ద ప్రసంగిస్తున్న తెలంగాణ హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి

వైఎంసిఎ వద్ద..

వైఎంసిఎ వద్ద..

హైదరాబాద్ వైఎంసిఎ వద్ద అర్జున అవార్డు గ్రహత మీరు ఖాసిం అలీ, ఎమ్మెల్యే రాంచందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

English summary
Former Olymiyan Aswini Nachappa participated in Olympic day run in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X