విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖలో హిజ్రాల అందాల పోటీలు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మూడో లింగంగా కోర్టు గుర్తించడంతో హిజ్రాలు తమ సామాజిక జీవితం విస్తృతిని పెంచుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. ఇన్నాళ్లకు తమకు కోర్టు ద్వారా న్యాయం జరిగిందనే అభిప్రాయంతో వారున్నారు. విశాఖపట్నంలో మే 1వ తేదీన హిజ్రాల అందాల పోటీలకు రంగం సిద్ధమవుతోంది.

మూన్ పవర్ ఈవెంట్స్, నంది సర్వీస్ సొసైటీ సంయుక్తంగా మే 1వ తేదీన విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో హిజ్రాల అందాల పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల ద్వారా వసూలయ్యే సొమ్మును పేద పిల్లలకు ప్రదానం చేస్తారు.

ఈ పోటీల సందర్భంగా హిజ్రాలు సోమవారం విశాఖపట్నం కలెక్టర్ సోలోమోన్ ఆరోక్యరాజ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. హిజ్రాల అందాల పోటీల కార్యక్రమానికి వారు కలెక్టర్‌ను ఆహ్వానించారు.

పోస్టర్ విడుదల

పోస్టర్ విడుదల

ట్రాన్స్ క్యీన్ పేర హిజ్రాల అందాల పోటీలు విశాఖపట్నంలో మే 1వ తేదీన జరగనున్నాయి. ఈ సందర్బంగా పోస్టర్‌ను విడుదల చేసిన హిజ్రాలు.

కలెక్టర్‌ను ఆహ్వానించారు...

కలెక్టర్‌ను ఆహ్వానించారు...

తమ అందాల పోటీల కార్యక్రమానికి ఆహ్వానించడానికి హిజ్రాలు సోమవారం విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ను కలిశారు.

ఆనందాల అంచుల్లో..

ఆనందాల అంచుల్లో..

కోర్టు తమను థర్డ్ జెండర్‌గా గుర్తించడంతో హిజ్రాలు ఆనందంలో మునిగిపోయారు. ఈ స్థితిలో తమ సామాజిక కార్యకలాపాలను విస్తరిస్తున్నారు.

పోస్టర్ విడుదల ఇలా..

పోస్టర్ విడుదల ఇలా..

మే 1వ తేదీన ట్రాన్స్ క్వీన్ పేర నిర్వహించే హిజ్రాల అందాల పోటీల పోస్టర్‌ను సోమవారం విశాఖపట్నంలో విడదుల చేశారు.

English summary
BEAUTY CONTEST FOR TRANS GENDERS TO BE HELD ON MAY1ST AT GURAJADA KALAKSHETRAM ORGANISED BY MOON POWER EVENTS AND NAANDI SERVICE SOCIETY. THE MONEY GATHERED BY THE ORGANISATION BY ORGANISING THE SHOW IS TO BE HANDED OVER TO THE POOR CHILDREN. YSTERDAY THEY INVITED COLLECTER Solomon Arokiaraj TO THE SHOW
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X