హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దసరా: పిల్లాపాపలతో కదిలిన సిటీ జనం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దసరా పర్వదినం(అక్టోబర్ 3న) పురస్కరించుకుని నగరంలో నివాసముంటున్న చాలా మంది ప్రజలు తమ తమ స్వస్థలాకు బయల్దేరుతున్నారు. దీంతో నగరంలో క్రమక్రమంగా జన సందడి తగ్గిపోతోంది. మూటముళ్లే, పిల్లాపాపలతో ప్రజలు తమ సొంత ఊళ్లకు తరలివెళుతున్నారు. ఆర్టీసి, ప్రైవేటు బస్సులు, రైళ్లలలో కిక్కిరిసి ప్రయాణం చేస్తున్నారు.

కాగా, ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ప్రీమియం పేరిట అదనపు వసూళ్లకు శ్రీకారం చుట్టడంతో పౌరుల్లో పండుగ సంతోషం టికెట్లు బుక్‌ చేసుకున్నప్పుడే ఆవిరవుతోంది. గతంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక సర్వీసులు నడిపినప్పటికీ.. ఈ సారి మాత్రం ప్రీమియం పేరిట బెర్తుల వ్యాపారాన్ని మొదలెట్టింది. ఇక్కడి సంస్కృతి, సంప్రయాదాలకు బతుకమ్మ పండుగను ప్రతీకగా ప్రకటించిన తెలంగాణ సర్కారు మునుపెన్నడు లేని రీతిలో 15 రోజుల సెలవులు ప్రకటించింది.

ప్రైవేట్‌ క్లాసులు, ప్రత్యేక తరగతుల పేరిట చదువులు చెప్పొద్దని కఠిన హెచ్చరికలు జారీ చేసింది. దీంతో దాదాపు అన్ని పాఠశాలలు పండుగ సెలవులు ప్రకటించాయి. దీంతో గతంతో పోలిస్తే గ్రామాలకు తరలుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఆయా జిల్లాలకు వెళ్లే బస్సులు జూబ్లీ, సీబీఎస్‌, ఎస్‌ఆర్‌నగర్‌, కేపీహెచ్‌బీ, ఈసీఐఎల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌ తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయి. దసరాకు తెలంగాణలోని వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ తదితర జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్టణం, రాజమండ్రి, ఏలూరు, కొవ్వూరులకు ప్రజలు తరలి వెళ్తున్నారు. దీంతో ప్రైవేట్‌ బస్సులకూ డిమాండ్‌ పెరిగింది.

తరలుతున్న జనం

తరలుతున్న జనం

దసరా పర్వదినం(అక్టోబర్ 3న) పురస్కరించుకుని నగరంలో నివాసముంటున్న చాలా మంది ప్రజలు తమ తమ స్వస్థలాకు బయల్దేరుతున్నారు. దీంతో నగరంలో క్రమక్రమంగా జన సందడి తగ్గిపోతోంది.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో..

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో..

మూటముళ్లే, పిల్లాపాపలతో ప్రజలు తమ సొంత ఊళ్లకు తరలివెళుతున్నారు. ఆర్టీసి, ప్రైవేటు బస్సులు, రైళ్లలలో కిక్కిరిసి ప్రయాణం చేస్తున్నారు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో..

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో..

కాగా, ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ప్రీమియం పేరిట అదనపు వసూళ్లకు శ్రీకారం చుట్టడంతో పౌరుల్లో పండుగ సంతోషం టికెట్లు బుక్‌ చేసుకున్నప్పుడే ఆవిరవుతోంది.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో..

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో..

గతంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక సర్వీసులు నడిపినప్పటికీ.. ఈ సారి మాత్రం ప్రీమియం పేరిట బెర్తుల వ్యాపారాన్ని మొదలెట్టింది.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో..

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో..

ఇక్కడి సంస్కృతి, సంప్రయాదాలకు బతుకమ్మ పండుగను ప్రతీకగా ప్రకటించిన తెలంగాణ సర్కారు మునుపెన్నడు లేని రీతిలో 15 రోజుల సెలవులు ప్రకటించింది.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో..

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో..

ప్రైవేట్‌ క్లాసులు, ప్రత్యేక తరగతుల పేరిట చదువులు చెప్పొద్దని కఠిన హెచ్చరికలు జారీ చేసింది.

పిల్లాపాపలతో..

పిల్లాపాపలతో..

దీంతో దాదాపు అన్ని పాఠశాలలు పండుగ సెలవులు ప్రకటించాయి. దీంతో గతంతో పోలిస్తే గ్రామాలకు తరలుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

English summary
Hyderabad City peoples are going to their hometowns to celebrate Dasara festival with their families.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X