హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గణేష్ నిమజ్జనం: యువతుల సందడి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో గణనాధుల నిమజ్జన వేడుకలు ప్రారంభంతో ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌తోపాటు నగరంలో వివిధ ప్రాంతాల్లో చెరువులలో నిమజ్జన వేడుకలు మంగళవారం 5వ రోజు అంగరంగవైభవంగా కొనసాగాయి. ట్యాంక్‌బండ్‌పైన ఐదు క్రేన్ల ద్వారా నిమజ్జన కార్యక్రమం కొనసాగించారు. జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ, పోలీసుశాఖల సమన్వయంతో నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు.

ట్యాంక్‌బండ్‌పైన గాంధీనగర్ పోలీసులు కంట్రోలు రూమ్‌ను ఏర్పాటుచేశారు. గంటగంటకు ఎన్ని వినాయకులు నిమజ్జనానికి వస్తున్నాయన్న వివరాలను గాంధీనగర్ పోలీసులు సేకరణలో నిమగ్నమయ్యారు. చిక్కడపల్లి ఎసిపి అమర్‌కాంత్‌రెడ్డి, గాంధీనగర్ ఇన్‌స్పెక్టర్ సంజీవరావు నిమజ్జన వేడుకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.

ప్రతి క్రేన్‌వద్ద ఇద్దరు పోలీసు సిబ్బంది, జిహెచ్‌ఎంసి సిబ్బందితోపాటు గజ ఈతగాళ్లను నియమించారు. దీంతోపాటు నెక్లెస్‌రోడ్ ఎన్టీఆర్ మార్గ్ సమీపంలో నాలుగు క్రేన్ల ద్వారా నిమజ్జన వేడుకలు కొనసాగుతున్నట్లు సైఫాబాద్ ఎసిపి ఇస్మాయిల్ తెలిపారు. రాంగోపాల్‌పేట ఇన్‌స్పెక్టర్ గంగిరెడ్డి, లేక్ ఇన్‌స్పెక్టర్ జానకమ్మతోపాటు సైఫాబాద్ పోలీసులు ఎన్టీఆర్ మార్గ్ వైపు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాట్లుచేశారు.

ఉదయం నుంచి గణనాధులు నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌కు ఊరేగింపుతో జంటనగరాలలోని వాడవాడలో కొలువుతీరిన వినాయకుల నిమజ్జనానికి భారీగా తరలివచ్చారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతంలో నగరంలోని పలు ప్రాంతాల నుంచి అశేష భక్త జనం రావడంతో పండుగ సందడి నెలకొంది. దీంతో ట్యాంక్‌బండ్ నుంచి రాణిగంజ్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో గంటల తరబడి వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు.

నిమజ్జనం

నిమజ్జనం

నగరంలో గణనాధుల నిమజ్జన వేడుకలు ప్రారంభంతో ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌తోపాటు నగరంలో వివిధ ప్రాంతాల్లో చెరువులలో నిమజ్జన వేడుకలు మంగళవారం 5వ రోజు అంగరంగవైభవంగా కొనసాగాయి.

నిమజ్జనం

నిమజ్జనం

హుస్సేన్‌సాగర్ వద్ద నిమజ్జనం చేసేందుకు తీసుకొచ్చిన గణనాథుడికి పూజలు చేస్తున్న యువతి.

నిమజ్జనం

నిమజ్జనం

ట్యాంక్‌బండ్‌పైన ఐదు క్రేన్ల ద్వారా వినాయక నిమజ్జన కార్యక్రమం కొనసాగించారు. జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ, పోలీసుశాఖల సమన్వయంతో నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు.

పీకలు ఊదుతూ సందడి

పీకలు ఊదుతూ సందడి

ఉదయం నుంచి గణనాధులు నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌కు ఊరేగింపుతో జంటనగరాలలోని వాడవాడలో కొలువుతీరిన వినాయకుల నిమజ్జనానికి భారీగా తరలివచ్చారు.

నిమజ్జనం

నిమజ్జనం

ట్యాంక్‌బండ్‌పైన గాంధీనగర్ పోలీసులు కంట్రోలు రూమ్‌ను ఏర్పాటుచేశారు.

నిమజ్జనం

నిమజ్జనం

ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతంలో నగరంలోని పలు ప్రాంతాల నుంచి అశేష భక్త జనం రావడంతో పండుగ సందడి నెలకొంది.

నిమజ్జనం

నిమజ్జనం

గంటగంటకు ఎన్ని వినాయకులు నిమజ్జనానికి వస్తున్నాయన్న వివరాలను గాంధీనగర్ పోలీసులు సేకరణలో నిమగ్నమయ్యారు.

నిమజ్జనం

నిమజ్జనం

ట్యాంక్‌బండ్ వద్ద హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు గణనాథుడిని తీసుకొస్తున్న యువతి.

నిమజ్జనం

నిమజ్జనం

చిక్కడపల్లి ఎసిపి అమర్‌కాంత్‌రెడ్డి, గాంధీనగర్ ఇన్‌స్పెక్టర్ సంజీవరావు నిమజ్జన వేడుకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.

నిమజ్జనం

నిమజ్జనం

ప్రతి క్రేన్‌వద్ద ఇద్దరు పోలీసు సిబ్బంది, జిహెచ్‌ఎంసి సిబ్బందితోపాటు గజ ఈతగాళ్లను నియమించారు.

English summary
Ganesh statues immersion continues at Hussain Sagar, in Hyderabad on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X