హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ల్యాప్‌టాప్‌ల నుంచి చైన్ స్నాచింగ్స్‌కు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏడాది కాలంగా సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసారు. ఈ గ్యాంగ్ ఏడాది కాలంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 57 చైన్ స్నాచింగ్‌లు, సైబరాబాద్ పోలీసు కమినషరేట్ పరిధిలో 18 చైన్ స్నాచింగ్‌లు చేసి రెండున్నర కిలోల బంగారాన్ని దోచుకుంది.

నిందితుల నుంచి 2.135 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూడు మోటారు సైకిళ్లను, ఒక డాగర్‌ను, రెండు ముఖానికి కప్పుకునే మాస్క్‌లను, ఆరు సెల్‌ఫోన్లను, ఒక కారం పొడి ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను మహేందర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన షేక్ సలీం శ్ర23), సయ్యద్ అబ్దుల్ మజీద్ (20), మహ్మద్ అహ్మద్ (20) గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. తొలుత ల్యాప్ టాప్ దొంగతనాలకు పాల్పడిన ఈ ముఠా ఇళ్ల దొంగతనాల్లో పట్టుబడి జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఈ ముఠా గత ఏడాది కాలంగా చైన్ స్నాచింగ్‌లకు దిగింది. నిందితుడు మహ్మద్ అహ్మద్ మాత్రం పరారీలో ఉన్నాడు.

బోనాలు, రంజాన్ పండుగలు ఒకేసారి వ్చచాయని, దీంతో బందోబస్తు కోసం సిటీ పోలీసుకు అదనంగా బయటి నుంచి కూడా బలగాలను రప్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. బోనాలు మహిళ పండుగ కావడంతో మహిళా బలగాలను ఎక్కువగా రప్పిస్తామని మహేందర్ రెడ్డి చెప్పారు.

ట్రాఫిక్ పోలీసులకు వారాంతం సెలవులు ఇచ్చే విషయంపై అధ్యయనం జరుగుతోందని ఆయన చెప్పారు. సిబ్బంది నియామకం జరగాలని కోరామని, దానికి ప్రభుత్వం అంగీకరించిందని ఆయన చెప్పారు. ఫిర్యాదు చేయగానే కేసు నమోదు చేయకపోతే చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

చైన్ స్నాచింగ్ ముఠా పట్టివేత

చైన్ స్నాచింగ్ ముఠా పట్టివేత

ల్యాప్‌టాప్ దొంగతనాలకు పాల్పడుతూ వచ్చిన ముఠా ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చింది. ఆ తర్వాత చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ వచ్చింది. ఆ ముఠాకు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

మీడియా సమావేశంలో సిపి

మీడియా సమావేశంలో సిపి

చైన్ స్నాచింగ్ ముఠా పట్టివేతకు సంబంధించిన వివరాలను హైదరాబాదు పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి మీడియా సమావేశంలో వివరించారు.

గాలింపు చర్యలు

గాలింపు చర్యలు

చోరీ సొత్తు కొనుగోలు చేసిన మీర్ సాజిద్ అలీ, సాగర్ కాక దొంబాలి, అబ్దుల్ రహ్మాన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. రిసీవర్లు ప్రవీణ్, రమేష్ కూడా పరారీలో ఉన్నట్లు మహేందర్ రెడ్డి చెప్పారు. వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

డ్రగ్స్ దందాపై ప్రత్యేక దృష్టి

డ్రగ్స్ దందాపై ప్రత్యేక దృష్టి

హైదరాబాదు నగరంలో కొనసాగుతున్న డ్రగ్స్ దందాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మహేందర్ రెడ్డి చెప్పారు. యాంటీ నార్కోటిక్ సెల్‌ను ఆధునీకరించినట్లు ఆయన తెలిపారు.

పాత నేరస్థులపై నిఘా

పాత నేరస్థులపై నిఘా

పాత నేరస్తులపై నిఘా కొనసాగుతుందని చెప్పారు. నిఘా పెట్టి రెండు రెండు గ్యాంగ్‌లను పట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

నేరాలను అరికట్టడానికి చర్యలు

నేరాలను అరికట్టడానికి చర్యలు

నేరాలను అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎం. మహేందర్ రెడ్డి వివరించారు.

వివిధ నేరాలపై వివరణ

వివిధ నేరాలపై వివరణ

వివిధ నేరాలకు సంబంధించిన విషయాలను వెల్లడిస్తూ వాటిని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలపై మహేందర్ రెడ్డి గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించారు.

రివార్డులు ఇస్తాం

రివార్డులు ఇస్తాం

దర్యాప్తులో నైపుణ్యం చూపించిన సిబ్బందిని ప్రోత్సహించేందుకు ప్రతీ నెల రివార్డులు ఇస్తామని చెప్పారు.

చర్యలు తీసుకుంటాం

చర్యలు తీసుకుంటాం

నగరంలో చైన్ స్నాచింగ్ నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. యేటా నగరంలో 600కు పైగా చైన్ స్నాచింగ్ కేసులు నమోదవుతున్నట్లు ఆయన తెలిపారు.

రిసీవర్లపై చర్యలు

రిసీవర్లపై చర్యలు

దొంగ సొమ్మును కొనుగోలు చేసే రిసీవర్లపై పీడియాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని చెప్పారు. దొంగతనాలు చేయడం ఎంత నేరమో కొనుగోలు చేయడం కూడా అంతే నేరమని ఆయన అన్నారు.

English summary
According to Hyderabad police commissioner M mahender a chain snatching gang has been nabbed by police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X