హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈ చదువొద్దు, ఉపాధ్యాయులొద్దు!: స్మృతి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మారుతున్న కాలానికి, పరిస్థితులకు అనుగుణంగా నూతన జాతీయ విద్యా విధానం రూపొందిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో 1986లో రూపొందించిన విద్యా విధానం అమల్లో ఉందని పేర్కొన్నారు. 2014 వరకు వచ్చిన మార్పులకు అనుగుణంగా నూతన విద్యా విధానం రూపొందించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.

అందులో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు, రీజియన్ల వారీగా చర్చలు నిర్వహించి కొత్త విధానం రూపకల్పన చేస్తామన్నారు. అలాగే ఫిబ్రవరి 21న దేశవ్యాప్తంగా మాతృభాషా దినోత్సవం నిర్వహిస్తామని ప్రకటించారు. సిబిఎస్‌ఇ, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలతో సహా అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ఆదివారం హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాలయం ప్లాటినం జూబ్లీ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు సాంస్కృతిక విద్యా విలువలు నేర్చుకోవాలన్నారు. నేటితరం విద్యార్థులు జాతి కోసం జీవితాల్ని త్యాగం చేసిన అనేకమంది మహనీయులను మర్చిపోతున్నారన్నారు. 3వన్ ఫ్లాగ్.. వన్ నేషన్2 అనే నినాదంతో త్వరలోనే సాంస్కృతిక సప్తాహ్ పేరిట వారంపాటు కార్యక్రమాలు నిర్వహిస్తామని, తద్వారా నేటి యువత కోసం మహనీయుల జీవితాలపై కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు.

 స్మృతి ఇరానీ

స్మృతి ఇరానీ

గురుశిష్యుల బంధం విడదీయరానిదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. మనకు కావాల్సింది ఉపాధ్యాయులు కాదని.. గురువులు కావాలన్నారు. ప్రస్తుత కాలంలో బోధన రంగం అనేక సవాళ్లతో కూడుకున్నదిగా మారిందని వ్యాఖ్యానించారు.

స్మృతి ఇరానీ

స్మృతి ఇరానీ

మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా గురువులు కూడా శిక్షణ పొంది బోధించాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా 3మేడిన్ ఇండియా2 బ్రాండ్ ఆశయం నెరవేర్చేందుకు అందరూ సహకరించాలని సూచించారు.

స్మృతి ఇరానీ

స్మృతి ఇరానీ

దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న భ్రూణ హత్యలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహారాష్టల్రోని బీడ్ జిల్లాలో జరిగిన భ్రూణ హత్యలకు సంబంధించిన చిన్న సంఘటన వివరించారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోభ్రూణ హత్యలు ఎక్కువగా జరుగుతుంటాయి.

స్మృతి ఇరానీ

స్మృతి ఇరానీ

అక్కడ ఓ డాక్టర్ అబార్షన్లు చేయడంలో ఫేమస్. ఆ విషయం అక్కడి ప్రజలందరికీ తెలుసు. కానీ సాక్ష్యం చెప్పేవారు లేకపోవడంతో ఆ డాక్టర్‌పై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ విషయాన్ని గమనించిన ఓ సామాజిక కార్యకర్త, ఓ టీవీ రిపోర్టర్‌తో కలిసి అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించింది.

స్మృతి ఇరానీ

స్మృతి ఇరానీ

సాధారణ మహిళ్లల్లాగే క్లినిక్‌కు వెళ్లి వైద్యుడితో మాట్లాడారు. 3 వేలు ఇస్తే అబార్షన్ చేస్తానని వైద్యుడు ఒప్పుకున్నాడు. ఇంతమందికి అబార్షన్‌లు చేస్తారు కదా అలా బయటకు తీసిన పిండాలను ఏం చేస్తారని మహిళ వెంట రిపోర్టర్ అడిగింది. దీంతో క్లినిక్‌లోని ఓ గది తలుపును తెరిచాడు. అందులో ఆరు కుక్కలు చిన్నారుల పిండాలను తింటూ కనిపించాయి.

 స్మృతి ఇరానీ

స్మృతి ఇరానీ

మనం లక్ష్మీదేవిగా భావించే ఇంటి ఆడ పిల్లలను ఆ డాక్టర్ కుక్కలకు భోజనంగా వేస్తున్నాడు. అలాంటి దౌర్భాగ్య స్థితికి సమాజం చేరుకుంది. ఆ వైద్యుడికి కాలేజీ సర్ట్ఫికెట్ మాత్రమే ఇచ్చింది. కానీ మానవత్వాన్ని నేర్పలేకపోయింది. ఇలాంటి విద్యా వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని అని భావోద్వేగంతో చెప్పారు. కార్యక్రమంలో కేశవ్ విద్యాలయాల చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి, షార్ డైరెక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ ప్రదీప్‌కుమార్, కళాశాల డైరెక్టర్ నీల్ గోప్టే మాట్లాడారు.

English summary
The Union HRD minister Smriti Irani said that a new National Education Policy will be formulated soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X