హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖైరతాబాద్ వినాయకుడు రెడీ (పిక్చర్స్)

అత్యంత ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం సిద్ధమైంది. హైదరాబాదులోని ఖైరతాబాద్‌లో యేటా ప్రతిష్టించే వినాయక విగ్రహం మీదనే అందరి దృష్టీ ఉంటుంది. ఈ ఏడాది కూడా ఎప్పటి లాగే అత్యంత భారీగా ఈ విగ్రహం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అత్యంత ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం సిద్ధమైంది. హైదరాబాదులోని ఖైరతాబాద్‌లో యేటా ప్రతిష్టించే వినాయక విగ్రహం మీదనే అందరి దృష్టీ ఉంటుంది. ఈ ఏడాది కూడా ఎప్పటి లాగే అత్యంత భారీగా ఈ విగ్రహం తయారైంది. దేశంలోనే అతి పెద్ద వినాయక విగ్రహంగా ఇది పేరు పొందింది.

నిరుడు శ్రీనాగోనాగ చతుర్ముఖ వినాయకుడిగా దర్శనమిచ్చాడు. 1954లో ఒక్క అడుగుతో ప్రారంభమైన వినాయక విగ్రహం నిరుడు 59 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 59 అడుగుల ఎత్తు నిర్మాణమైంది.

హైదరాబాదులో మిగతా వినాయకుల విగ్రహాలన్నీ నిమజ్జమైన తర్వాతనే ఖైరతాబాద్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. ఈ విగ్రహాన్ని చూడడానికి ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద యెత్తున భక్తులు, ప్రముఖులు వస్తుంటారు.

ఖైరతాబాద్ వినాయకుడు రెడీ

ఖైరతాబాద్ వినాయకుడు రెడీ

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ప్రతిష్టించే అతి భారీ వినాయకుడి విగ్రహం సిద్ధమైంది. దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది.

ఖైరతాబాద్ వినాయకుడు రెడీ

ఖైరతాబాద్ వినాయకుడు రెడీ

ఖైరతాబాద్ వినాయకుడు భక్తులనే కాకుండా సాధారణ ప్రజలను కూడా ఆకర్షించే విధంగా రూపు దిద్దుకున్నాడు.

ఖైరతాబాద్ వినాయకుడు రెడీ

ఖైరతాబాద్ వినాయకుడు రెడీ

ఖైరతాబాద్ విగ్రహమంటే ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈ ఏడాది కూడా ఆ విగ్రహం తన ప్రత్యేకను కాపాడుకుంటోంది.

ఖైరతాబాద్ విగ్రహం రెడీ

ఖైరతాబాద్ విగ్రహం రెడీ

ఈ నెల 29వ తేదీన వినాయక చవితి రోడు ప్రతిష్టించడానికి వీలుగా ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం సిద్ధమైంది.

ఖైరతాబాద్ వినాయకుడు రెడీ

ఖైరతాబాద్ వినాయకుడు రెడీ

పలువురు రాజకీయ ప్రముఖులు, ఇతర ప్రముఖులు ఖైరతాబాద్ విగ్రహాన్ని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోంది.

ఖైరతాబాద్ వినాయకుడు రెడీ

ఖైరతాబాద్ వినాయకుడు రెడీ

నిరుడు ఖైరతాబాద్ వినాయక విగ్రహాన్ని గవర్నర్ నరసింహన్ దర్శించుకుని పూజలు చేశారు. ఈ ఏడాది కూడా ఆయన దర్శించుకునే అవకాశం ఉంది.

ఖైరతాబాద్ వినాయకుడు రెడీ

ఖైరతాబాద్ వినాయకుడు రెడీ

ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం ప్రతిష్టాపనకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో ఈ వినాయకుడి ఏర్పాటు జరుగుతోంది.

ఖైరతాబాద్ వినాయకుడు రెడీ

ఖైరతాబాద్ వినాయకుడు రెడీ

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహాన్ని యేటా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.

English summary
The Khairatabad Ganesh statue is ready for this Vinayaka Chavithi. This attract the people from all over India every year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X