వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్: కుడికాలు పెట్టారు, పూజ చేశారు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బంజారాహిల్స్ నందినగర్‌లోని తన సొంత నివాసం నుంచి ఆదివారం బేగంపేటలోని అధికారిక నివాసానికి మారారు. ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లిన ఆయన తొలుత సతీసమేతంగా వాస్తుదోష నివారణ పూజలు, సుదర్శన యాగం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, తనయుడు రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, కూతురు, నిజామాబాద్ ఎంపీ కవిత, ఇతర కుటుంబ సభ్యులు, నమస్తే తెలంగాణ ఎండీ సీఎల్ రాజం దంపతులు తదితరులు పాల్గొన్నారు.

ప్రస్తుత బంజారాహిల్స్‌లోని ఇంటిని కెటి రామారావు తన క్యాంప్ ఆఫీసుగా వాడుకుంటారు. కెసిఆర్ సరిగ్గా ఉదయం 10 గంటల 40 నిమిషాలకు అధికారిక నివాసంలో అడుగు పెట్టారు.

కెసిఆర్ సుదర్శన యాగం

కెసిఆర్ సుదర్శన యాగం

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బేగంపేటలోని అధికారిక నివాసానికి ఆదివారంనాడు మారారు. ముహూర్తం చూసుకుని నివాసంలో కాలు పెట్టారు.

అధికారిక నివాసంలోకి కెసిఆర్

అధికారిక నివాసంలోకి కెసిఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు తన భార్య శోభ, కుటుంబ సభ్యులు కెటి రామారావు, కవిత తదితరులతో కలిసి అధికారిక నివాసంలో అడుగు పెట్టారు.

కుడికాలు పెట్టారు.

కుడికాలు పెట్టారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు అధికారిక నివాసంలోకి ఆదివారంనాడు కుడి కాలు లోనికి పెట్టి ప్రవేశించారు.

వాస్తు దోష నివారణ పూజలు

వాస్తు దోష నివారణ పూజలు

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారిక నివాసంలో వాస్తు దోష నివారణ పూజలు కూడా చేశారు.

సతీమణి శోభతో కలిసి...

సతీమణి శోభతో కలిసి...

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదివారంనాడు తన సతీమణి శోభతో కలిసి సుదర్శన యాగం, వాస్తుదోష నివారణ పూజలు చేశారు.

కూతురు, కుమారులతో కలిసి..

కూతురు, కుమారులతో కలిసి..

అధికారిక నివాసంలోకి కె చంద్రశేఖర రావు అడుగు పెట్టినప్పుడు ఆయన వెంట కుమారుడు కెటి రామారావు, కూతురు కవిత, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

సిఎల్ రాజం దంపతులు కూడా...

సిఎల్ రాజం దంపతులు కూడా...

విభేదాలు తలెత్తాయని భావిస్తున్న తరుణంలో కెటిఆర్ అధికారిక నివాసంలోకి అడుగు పెట్టిన ముహూర్త కార్యక్రమానికి నమస్తే తెలంగాణ దినపత్రిక అధిపతి సిఎల్ రాజం దంపతులు కూడా వచ్చారు.

English summary
Telangana Chief Minister K. Chandrasekhar Rao on Sunday moved into the sprawling CM’s Camp Office in Begumpet. He performed ‘Sudharshana yagam’ and ‘Vastu puja’ on the occasion along with his wife Shobha, son and IT minister K.T. Rama Rao and daughter and Nizamabad MP Kavitha and other family members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X