వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పు ఒప్పుకున్న చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండోసారి కూడా అధికారం చేతికి రాకపోవడంతో ప్రజల ముందు పశ్చాత్తాప పడుతున్నారు. 2009 ఎన్నికల తర్వాత ఆయన మాటల్లో, చేతల్లో మార్పు కనిపిస్తోంది. తాను మారానని, తాను తప్పు చేశానని ఆయన ఇటీవలి కాలంలో ప్రజల ముందు, పార్టీ కార్యకర్తల ముందు చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా చంద్రబాబు రైతు పోరుయాత్ర పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ప్రకాశం జిల్లాలో పర్యటన సందర్భంగా బాబు రైతుల విషయంలో తాను చేసిన తప్పును ఒప్పుకున్నారు. అదే సమయంలో దానిని సమర్థించుకున్నట్లుగా కనిపిస్తోంది. తాను అధికారంలో ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తే బావుండేదని అది తాను చేసిన తప్పని అన్నారు. అదే సమయంలో అప్పుడు సరిపడా విద్యుత్ లేనందునే తాను ఇవ్వలేక పోయానని సమర్థించుకున్నారు.

ఇటీవల మహానాడులో తాను మారానని బాబు చెప్పారు. గతంలో బాబు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండేవారు కాదనే వాదనలు ఉన్నాయి. దానిపై ఆయన స్పందిస్తూ తాను ఇక నుండి సాధారణ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉంటానని చెప్పుకొచ్చారు. చెప్పినట్లుగానే బాబు ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంటున్నారట. 2014 ఎన్నికల్లో ఎలాగైనా పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకు రావడానికి ఆయన తన సర్వశక్తులూ ఇప్పటి నుండే ఒడ్డుతున్నారు. గతంలో చదువుకునే వారికి రాజకీయాలు వద్దని టిఎన్ఎస్ఎఫ్ రద్దు చేసిన బాబు పునరుద్ధరించారు. యువతకు మరింత దగ్గర కావడానికి తెలుగు యువతలో ముప్పై అయిదేళ్లకు పైబడిన వారికి నో వేకెన్సీ అనే రూల్ తీసుకు వచ్చారు.

అలాగే పార్టీకి దూరమైన సీనియర్ నేతలను, దూరమవుతారనుకున్న నేతలతో మాట్లాడి వారిని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చేస్తున్నారు. టిడిపి హయాంలో ఉద్యోగులకు బాబు అంటే హడల్. ఇప్పుడు వారిని కూడా దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక హైటెక్ హంగులకు మురిసిపోయి రైతులను ఏమాత్రం పట్టించుకోలేదనే ఆరోపణలు బాబు మీద ఇంతా అంతా కాదు. రైతులకు దగ్గరయ్యేందుకు ఆయన ఇప్పుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ ఓ ఎత్తైతే బాబు తాను మారానని, తాను తప్పు చేశానని చెబుతూ తన వ్యక్తిగత ప్రతిష్టను కూడా ఫణంగా పెట్టడం విశేషం.

English summary
TDP chief Nara Chandrababu Naidu accepted his falt on agriculture in his ruling time. He stated that he make mistake in free current for farmers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X