సిఎం కిరణ్ వ్యూహం: ఎమ్మెల్యేలకు నిధులు ఎర?

ఆదివారం, ఫిబ్రవరి 12, 2012, 10:41 [IST]
Kiran Kumar Reddy
శాసనసభ్యులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిధులను ధారాళంగా విడుదల చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలకు నిధులు ఎర వేసి తన వైపు లాక్కునేందుకు సిఎం ప్రయత్నిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. టిడిపి సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న వర్ధన్నపేట నియోజకవర్గానికి రూ.2.5 కోట్ల నుండి 4.5 కోట్ల వరకు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ నియోజకవర్గానికి రూ.2 కోట్ల నుండి రూ.6 కోట్ల వరకు, గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవిపై విజయం సాధించిన ఉషారాణి ప్రాతినిధ్యం వహిస్తోన్న పాలకొల్లుకు రూ.3 కోట్లకు పైగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నుండి తిరిగి వచ్చిన కుంజా సత్యవతితో పాటు, చిరంజీవి వర్గం ఎమ్మెల్యేలు అయిన కన్నబాబు, నాని, కాటసానిలకు రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లుగా తెలుస్తోంది. సామ, దాన, భేద, దండోపాయాల్లో ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు ఆయన దానోపాయాన్ని ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఏడాది బడ్జెట్లో గత ఏడాది ఫిబ్రవరిలో నియోజకవర్గాల అభివృద్ధి కోసమంటూ రూ.400 కోట్లతో ముఖ్యమంత్రి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. ఆ నిధుల మంజూరు విషయంలో ఇప్పటి వరకు కిరణ్ ఆచితూచి వ్యవహరించారు. ఏడాది తర్వాత, మళ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో ఎట్టకేలకు ఆ నిధుల పంపిణీకి శ్రీకారం చుట్టారు.

వాస్తవానికి, శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం ఎమ్మెల్యేలకు కోటి రూపాయల వరకూ ఖర్చు చేసే అధికారం ఉంది. ఈ మొత్తాన్ని రెండు కోట్లకు పెంచాలని కోరుతున్నారు. దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే శాసన సభ్యులకు ఇచ్చే అభివృద్ధి నిధులతోపాటు సిఎం పర్యటన సమయంలో ప్రజలు, స్థానిక నేతల నుంచి వచ్చే వినతులపై అక్కడికక్కడే హామీలు ఇవ్వాల్సి వస్తుంది. వాటిని నెరవేర్చేందుకు గత ఏడాది రూ.400 కోట్లను కేటాయించారు. ఈ నిధులను ఇప్పటి వరకు పెద్దగా ఖర్చు చేయలేదు. కానీ, మంత్రి వర్గ విస్తరణ తర్వాత అధికార పక్షంలో అసంతృప్తి నెలకొన్న సంగతి తెలిసిందే. దీనికి తోడు, పదవులు రాక అభివృద్ధి నిధులు మంజూరు కాక, తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేకపోతున్నామని, నియోజకవర్గాల్లో తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయనే అసహనాన్ని గత రెండున్నరేళ్లుగా పలువురు శాసనసభ్యులు వ్యక్తం చేస్తున్నారు. పలు నియోజకవర్గాలకు అభివృద్ధి నిధులను మంజూరు చేయడం బుజ్జగించడమే ధ్యేయంగా కావొచ్చునని అంటున్నారు. శనివారం విడుదల చేసిన నిధుల్లో అత్యధికంగా పిఆర్పీ నుంచి వచ్చినవారు, తొలిసారి ఎన్నికైన వారు, జగన్ గూటికి దూరమైన శాసనసభ్యులే ఉండడం విశేషం.
English summary
It seems, CM Kiran Kumar Reddy is chalked out a strategy against disappointed and opposition mlas.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST