అతని ఓటమే లక్ష్యంగా జయప్రద, వారంపాటు తిష్ట

బుదవారం, ఫిబ్రవరి 15, 2012, 10:47 [IST]
Jayaprada
రాంపూర్ లోకసభ సభ్యురాలు జయప్రద ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో తన నియోజకవర్గం పరిధిలో ఉన్న రాంపూర్ అసెంబ్లీ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. జయప్రద స్థానికురాలు కాకపోయినప్పటికీ రాంపూర్ ప్రజలు ఆమెను వరుసగా రెండుసార్లు గెలిపించారు. అయితే ఆమె అప్పుడు సమాజ్ వాదీ పార్టీ నుండి పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల ఆమె తన రాజకీయ గురువు అమర్ సింగ్ ఎస్పీ అధినేత ములాయం సింగ్‌తో విభేదించి బయటకు వచ్చి రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీ స్థాపించారు. జయప్రద అమర్ సింగ్ తరఫున రాష్ట్రంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. జయప్రదకు ముందు రాంపూర్ నుండి అజంఖాన్ ఎస్పీ అభ్యర్థిగా ఉండేవారు. ఆమె రాకతో అజంఖాన్ ఎస్పీకి గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు వీరు ఎస్పీ నుండి బయటకు వెళ్లడంతో అతను తిరిగి వచ్చి రాంపూర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. రాంపూర్‌పై జయప్రద, అజం ఖాన్ వ్యక్తిగతంగా పట్టు సాధించుకునేందుకు ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీగా ఉన్న జయప్రద అజం ఓటమే లక్ష్యంగా ప్రచారానికి నడుం కట్టింది. అమర్ కంటే జయప్రదకే జనాల్లో ప్రజాధరణ ఎక్కువ. దీంతో ఆమె రాంపూర్‌లోనే చివరి వారం రోజులు తిష్ట వేసేందుకు ప్లాన్ చేసుకున్నారు.

మరోవైపు అజం ఖాన్‌కు నోటీ దురుసు ఎక్కువ అనే ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల ఆయన గతంలో పలుమార్లు దెబ్బతిన్నారు. తాజాగా ఆయన కాంగ్రెసును హిజ్రాల పార్టీగా అభివర్ణించి విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాంపూర్‌లో తాను విజయం సాధించి జయప్రదకు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. జయప్రద అమర్ స్థాపించిన రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీకి ఉపాధ్యక్షురాలు. మరోవైపు అమర్ సింగ్ కూడా తనను పార్టీ నుండి బయటకు గెంటి తన తనయుడు అఖిలేష్ కుమార్‌కు ములాయం సింగ్ పగ్గాలు అప్పగించడంతో సమాజ్ వాదీని ఒడించేందుకు ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తాను ఎలాగూ గెలవనని ఆయనకు తెలుసు. అందుకే ఆయన మొదటి నుండి తమకు వ్యతిరేకమైన మాయావతి ఆధ్వర్యంలోని బిఎస్పీని, తనను బయటకు గెంటివేసిన సమాజ్ వాదీ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధ్యమైనంత మేర ఎస్పీ, బిఎస్పీ ఓట్లు చీల్చి ములాయం, మాయాల విజయావకాశాలు దెబ్బకొట్టాలనే వ్యూహంతో ఆయన ఉన్నారు.

తన పార్టీకి బకెట్ గుర్తు కేటాయించడంపై ఆయన ప్రచారంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యుపి రాజకీయాల్లోని మురికిని బకెట్‌తో కడిగేస్తానని ఆయన చెబుతున్నారు. తనవల్లే యుపిఏ ప్రభుత్వం సంక్షోభం నుండి అనేకసార్లు బయటపడిందని చెబుతున్నారు. ములాయం తనకు చేసిన ద్రోహం గురించి ప్రస్తావిస్తున్నారు. మొత్తానికి యుపి ఎన్నికలు ఆప్తమిత్రులు అయిన అమర్ సింగ్, జయప్రదల భవిష్యత్తుకు పెద్ద పరీక్ష అని చెప్పవచ్చు.
English summary
RLM vice president, Rampur MP Jayaprada is trying to defeat SP candidate Azam Khan in elections.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST