వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశ్లేషణ: బిజెపి, కాంగ్రెస్, ఆప్‌పై ట్విట్టర్ కమ్యూనిటీ

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: త్వరలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోషల్ మీడియా ట్విట్టర్‌లో కూడా రాజకీయ పార్టీలపై ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. అనుకూల, ప్రతికూల సందేశాలతో ట్విట్టర్ ప్రచార వేదికగా కొనసాగుతోంది. ఒక్క మార్చి నెలలోనే 15 రాష్ట్రాల్లో 9 లక్షల ట్వీట్లు ట్విట్టర్‌లో నమోదయ్యాయి. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలపై ప్రజలు తమ సందేశాలను ట్విట్టర్ వేదికగా వ్యక్తపరుస్తున్నారు. ఏ పార్టీపై ఎలాంటి అభిప్రాయాలను ప్రజలు వ్యక్తీకరించారో ఆ వివరాలను విశ్లేషనాత్మకంగా పరిశీలిద్దాం.

ఏ రాజకీయ పార్టీలకు ప్రజలు ఎక్కువ అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉన్నారనే అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. డెక్కన్ హెరాల్డ్ స్టోరీ కూడా ఇందుకు కొంత తోడ్పడింది.

Analysis: See what Twitter community thinks of BJP, Congress, AAP

ప్రాథమిక విశ్లేషణ:

బిజెపి 8 రాష్ట్రాల్లో అనుకూల ప్రభావాన్ని(స్పందన) కలిగి ఉంది. అవి: పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్.

బిజెపికి అత్యంత అనుకూలత ఉన్న రాష్ట్రాలు 9: అవి: ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్. అనుకూలత-ప్రతికూలత మొత్తం మార్జిన్ 16.5శాతం.

కనీసం 7 రాష్ట్రాల్లో బిజెపి పార్టీ అత్యంత అనుకూలతతోపాటు ప్రతికూలత కలిగి ఉంది.

Political party Number of states in which it gets most positive sentiments Number of states in which it gets least negative sentiments % Margin (positive-negative/total)*
BJP
8 (WB, Delhi, Gujarat, Haryana, Kerala, Madhya Pradesh, Rajasthan, Uttar Pradesh)
9 (Delhi, Gujarat, Haryana, Karnataka, Kerala, Madhya Pradesh, Rajasthan, Tamil Nadu, Uttar Pradesh) 16.5%
AAP 4 (Andhra Pradesh, Karnataka, Punjab, Tamil Nadu)
3 (WB, Jharkhand, Maharashtra)

13.61%
Congress 3 (Himachal Pradesh, Jharkhand) 3 (Andhra Pradesh, Himachal Pradesh, Punjab)
11.68%

ఆమ్ ఆద్మీ పార్టీ అనుకూలత కలిగి ఉన్న రాష్ట్రాలు 4: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు. మరికొంత సానుకూలంగా ఉన్న రాష్ట్రాలు: పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర. అనుకూలత- ప్రతికూలత మొత్తం మార్జిన్ 13.61శాతం.

కాంగ్రెస్ పార్టీ సానుకూలతను సాధించడంలో పూర్తిగా విఫలమైందనే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి రెండు రాష్ట్రాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్. తక్కువ సానుకూలంగా ఉన్న రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్. అనుకూలత-ప్రతికూలత మొత్తం మార్జిన్ 11.68శాతం.

ప్రజలు తాము అభిమానించే పార్టీలకు మద్దతుగా తమ సందేశాలను ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అదే విధంగా తాము వ్యతిరేకించే పార్టీలపై కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ట్విట్టర్ సందేశాలను మొత్తంగా పరిశీలించినట్లయితే ప్రజలు బిజెపికే అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపికి అత్యంత అనుకూలంగా 7 రాష్ట్రాలుండగా, కాంగ్రెస్ పార్టీకి ఒక రాష్ట్రం ఉంది. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్క రాష్ట్రం కూడా అత్యంత అనుకూలంగా ఉండకపోవడం గమనార్హం.

Political party
Number of states in which it gets most positive as well as least negative sentiments
BJP 7
AAP 0
Congress 1

ఈ విశ్లేషనను సమర్థించే వివరాలను ఇక్కడ చూడొచ్చు.

మరిన్ని ప్రశ్నలకి విశ్లేషణని పొందవచ్చు. Twitris India Election 2014 Insight page.

సంప్రదించండి: ([email protected], [email protected]) for examples on sample constituencies and other insights.

English summary
Month of March was full of election campaigns by each of the political party. Based on 900,000 tweets collected from 15 states about three major political parties (BJP, Congress and AAP), our analysis shows how people talked about and reacted to each political party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X