వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌కు కౌంటర్: చంద్రబాబు మేడిన్ ఇండియా

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు మేడిన్ తెలంగాణ నినాదానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇవ్వబోతున్నారు. మేడిన్ ఇండియా నినాదం ద్వారా కెసిఆర్ నినాదాన్ని ఢీకొట్టే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు సమాచారం. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సిహించి, వాటికి మార్కెట్ కల్పించే ఉద్దేశంతో కెసిఆర్ మేడిన్ తెలంగాణ బ్రాండ్‌కు శ్రీకారం చుట్టారు

చంద్రబాబు ఆలోచనల మేరకు ఐటి, ఎలక్ట్రానిక్స్, ఈ గవర్నెన్స్ బ్లూ ప్రింట్‌ను చంద్రబాబు సోమవారం శ్రీకారం చుట్టారు. చంద్రబాబు ఎలక్ట్రానిక్ పాలసీ 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించి, 2020నాటికి లక్ష ఉద్యోగాలు కల్పించే ఉద్దేశ్యంతో రూపొందింది. ఈ విధానంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 ఎలక్ట్రానిక్ క్లష్టర్స్‌ను (ఇఎంసిలను), 200 పరిశ్రమలను ఏర్పాటు చేస్తారు.

రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ అభివృద్ధికి చంద్రబాబు కేరళ సాయం తీసుకోనున్నారు. కేరళ కొచ్చిలో స్టార్టప్ విలేజ్‌ను విజయవంతంంగా అమలు చేసింది. ఆంధ్రప్రదేశ్ నూతన విధానంలో భాగంగా 100 ఇంకుబేషన్‌తో స్టార్టప్ విలేజ్‌ను ఏర్పాటు, 5 వేల స్టార్టప్స్/ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను స్థాపిస్తారు.

దాంతో పాటు చంద్రబాబు బ్లూప్రింట్ మూడు యంత్రాంగాలను గుర్తించింది. అవి ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి మిషన్, ఇన్నోవేషన్ అండి కెపాసిటీ బిల్డింగ్ మిషన్, ఈ గవర్నెన్స్ మిషన్. ఎలక్ట్రానిక్స్ మిషన్‌లో భాగంగా మేడిన్ ఇండియా బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తారు. ఇందుకుగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించనుంది. అలాగే ఎన్నారైలకు ప్రత్యేక రాయితీలను ప్రకటిస్తారు. విశాఖపట్నం వద్ద 2 వేల ఎకరాల్లో ఐటి హబ్ రూపుదిద్దుకోనుంది.

చంద్రబాబు బ్లూ ప్రింట్

చంద్రబాబు బ్లూ ప్రింట్

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టే కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం బ్లూ ప్రింట్ విడుదల చేశారు.

చంద్రబాబు బ్లూ ప్రింట్

చంద్రబాబు బ్లూ ప్రింట్

ఐటి, ఎలక్ట్రానిక్స్, ఈ గవర్నెన్స్‌లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రణాళికను చంద్రబాబు సోమవారంనాడు విడుదల చేశారు.

చంద్రబాబు బ్లూ ప్రింట్

చంద్రబాబు బ్లూ ప్రింట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్పత్తులను మేడిన్ ఇండియా బ్రాండ్‌తో ముందుకు తీసుకు రావాలని చంద్రబాబు నిర్ణయించారు.

చంద్రబాబు బ్లూ ప్రింట్

చంద్రబాబు బ్లూ ప్రింట్

ఎలక్ట్రానిక్ పాలసీని 50 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, 2020నాటికి లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చంద్రబాబు రూపొందించారు.

చంద్రబాబు బ్లూ ప్రింట్

చంద్రబాబు బ్లూ ప్రింట్

ఎలక్ట్రానిక్ అండ్ ఐటి, ఇన్నోవేషన్ అండ్ కెపాసిటి బిల్లింగ్, ఈ గవర్నెన్స్ మిషన్లను చంద్రబాబు ఏర్పాటు చేయనున్నారు.

చంద్రబాబు బ్లూ ప్రింట్

చంద్రబాబు బ్లూ ప్రింట్

రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ అభివృద్ధికి చంద్రబాబు కేరళ సాయం తీసుకోనున్నారు. స్టార్టప్ విలేజ్ స్థాపనకు కేరళ ఆదర్శంగా ఉంది.

English summary
'Made in India' will be Andhra Pradesh government's counter slogan to Telangana regime's move to boost local products with the catch word 'Made in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X