న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సానియా మీర్జా వివాదం: పూర్వాపరాలు

బెంగళూరు: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రకటించడం పట్ల భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. సానియా మీర్జాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

సానియా మీర్జా ఎవరు?

ఆమె మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. ఆ తర్వాత ఆమెను పూర్వీకులు నివాసం ఉంటున్న హైదరాబాద్‌లోని తమ ఇంటికి తీసుకువచ్చారు.

2010లో పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకుంది.

ఇటీవలి వివాదం ఏమిటి?

India's daughter to Pakistan's daughter-in-law -- Sania Mirza: Controversy Explained

ఇటీవల (జులై 23, 2014న) తెలంగాణ బిజెపి నాయకుడు కె లక్ష్మణ్ మాట్లాడుతూ.. సానియా మీర్జాను పాకిస్థాన్ కోడలు అని అన్నారు.

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ కావడానికి సానియా మీర్జాకు ఉన్న అర్హత(ఆధారాలు)లేమిటని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమంలో సానియా మీర్జా ఎప్పుడూ పాల్గొనలేదని ఆయన అన్నారు.

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకున్న సానియా మీర్జా స్థానికురాలేలా అవుతుందని ప్రశ్నించారు.

సానియా మీర్జాను బిజెపి వ్యతిరేకించడానికి అసలు కారణం:

తెలంగాణలో పుట్టి పెరిగిన సీమాంధ్రకు చెందిన పిల్లలకు స్కాలర్ షిప్‌లు అందించేందుకు కెసిఆర్ ఇటీవల నిరాకరించారు.

తెలంగాణలో పుట్టి పెరిగిన సీమాంధ్రులు బయటివారు అయినప్పుడు వేరే రాష్ట్రంలో పుట్టి ఇక్కడికి వచ్చి, ఆ తర్వాత పాకిస్థాన్ వ్యక్తిని వివాహమాడిన సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎలా ప్రకటిస్తారని విపక్షలు ప్రశ్నిస్తున్నాయి.

సానియా మీర్జా వివాదంలో రాజకీయాలు:

మైనార్టీలను ప్రసన్నం చేసుకునేందుకే తెలంగాణ రాష్ట్ర సమితి సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారని బిజెపి ఆరోపిస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మైనార్టీల నుంచి లబ్ధి పొందేందుకే టిఆర్ఎస్ సానియాను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించిందని ఆరోపించింది.

సానియా మీర్జా ఏమంటోంది?

నేను పాకిస్థాన్‌కు చెందిన షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకున్నాను. అయినా నేను భారతీయురాలిని. నేను జీవితాంతం భారతీయురాలిగానే ఉంటాను.

పలువురు రాజకీయ నాయకులు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుని నా స్థానికతపై చేస్తున్న ఆరోపణలు నన్ను చాలా బాధించాయి. మీడియా కూడా ఇంత చిన్న విషయాన్ని అనవసరంగా ఎక్కువ చేసి చూపిస్తోంది.

దేశానికి, రాష్ట్రానికి సంబంధించిన అత్యవసర సమస్యలను పరిష్కరించేందుకు ఈ సమయాన్ని కేటాయిస్తారని ఆశిస్తున్నాను.

తెలంగాణతో సానియా మీర్జాకు సంబంధం:

సానియా మీర్జా తల్లి గర్భవతిగా ఉన్న సమయంలో ఆమెకు తీవ్ర అనారోగ్యం చేసింది. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను ముంబైలోని ఆస్పత్రికి తరలించారు. దీంతో అక్కడే సానియా మీర్జా జన్మించారు.

ఆ తర్వాత ఆమె పుట్టిన మూడు వారాలకు హైదరాబాద్ తీసుకొచ్చారు.

సానియా మీర్జా ముత్తాతలు కూడా శతాబ్దాలకు పైగా హైదరాబాద్‌లోనే జీవించారు.

ఆమె తాత మహ్మద్ జాఫర్ మీర్జా 1948లో నిజాం రైల్వేస్‌(హైదరాబాద్)లో ఇంజినీర్‌గా తన జీవితాన్ని ప్రారంభించారు. అతని పూర్వీకులు కూడా హైదరాబాద్‌లోనే జీవించారు.

ఆమె ముత్తాత అజీజ్ మీర్జా నిజాంల పాలనలో హోం సెక్రటరీగా పని చేశారు.

అజీత్ మీర్జా 1908లో మూసీ నది వరదల కారణంగా నిర్వాసితులైన ప్రజల కోసం పునరావాసం కల్పించేందుకు అవిరామంగా పని చేశారు.

Story first published: Wednesday, November 15, 2017, 12:24 [IST]
Other articles published on Nov 15, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X