వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ కసరత్తు: అభివృద్ధికి సరిజోడు సంక్షేమం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌‌: కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే అభివృద్దిపై దృష్టి సారించేందుకు వీలైన ప్రణాళికలను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. సంక్షేమ రంగాన్ని నిర్లక్ష్యం చేయకూడదనే ఉద్దేశంతో ఆయన అన్నారు. ఈ విషయాన్ని ఇది వరకే కెసిఆర్ తన సహచర మిత్రులతో పాటు పార్టీ నేతలు, మంత్రివర్గ స హచరులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని దళితులు, గిరిజనులతో పాటు మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోయారని భావిస్తున్న కెసిఆర్ ఆ లోటును భర్తీ చేసేందుకు ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు సంక్షేమ ఫలాలు పూర్తిగా బాధితులకు అందేలా ప్రభుత్వపరంగా పకడ్భందీ చర్యలు తీసుకునేందుకు కూడా కెసిఆర్ ముమ్మరమైన ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం అధికారులతో కెసిఆర్ సమాలోచనలు జరుపుతుననట్లు తెలుస్తోంది.

 KCR to concentrate on welfare measures

సంక్షేమ ఫలాలు ప్రజలకు అందడంలో జరిగిన లోటుపాట్లతో పాటు ఇతర రకాల సమస్యలను తెలుసుకునేందుకు కెసిఆర్ అధికారులతో తగిన రీతిలో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ శాఖను అవినీతి ఆరోపణలతో ఎలాంటి మచ్చలేని అధి కారులకు ఈ శాఖను కేటాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ శాఖను ఆ వర్గానికి (ఎస్సీ) చెందిన అధికారులకే కేటాయిస్తే మంచిదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయినట్లు తెలుస్తోంది.

ఈ విషయాలను స్వయంగా అధికారులే వెల్లండిం చినట్లు సమాచారం. దీంతో ఎస్సీ వర్గానికి చెందిన అధికారుల కోసం వేటను ఆరంభించినట్లు తెలుస్తోంది. పలువురు దళిత సంఘాల ప్రతినిధులు సైతం ఈ విషయాన్ని ఇటీవలనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అంతేకాకుండా తన వద్ద ఈ శాఖ వుండడం వల్ల అవినీతికి కూడా పెద్దగా తావుండదనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.

English summary

 Telangana CM K Chandrasekhar rao (KCR) is concentrating on welfare measures along with development measures.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X