వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసంఘ్ నుండి గవర్నర్ దాకా: సిహెచ్. విద్యాసాగరరావు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా సిహెచ్ విద్యాసాగరరావు మాట్లాడుతూ గవర్నర్‌గా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తానని , మహారాష్ట్ర ఉత్తమ గవర్నర్ల జాబితాలో నిలుస్తానని అన్నారు. విద్యాసాగరరావు వయసు 73 సంవత్సరాలు. ఈ వయసులో కూడా యువకుడిగానే ఉత్సాహంగా పనిచేయడం పార్టీ నేతలను ఇప్పటికీ ఆశ్చర్యం గొలుపుతుంది.

కేంద్ర హోం శాఖ మాజీ సహాయ మంత్రి చెన్నమనేని విద్యాసాగరరావును మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించిన సందర్బంగా ఆయనను పార్టీ రాష్టక్రార్యాలయంలో మంగళవారం నాడు ఘనంగా సత్కరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి, మాజీ గవర్నర్ వి రామారావు తదితరులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాసాగరరావు పార్టీ నాయకులను ఉద్ధేశించి, పాత్రికేయులను ఉద్ధేశించి ఆయన మాట్లాడారు.

తొలి నుండి ఎంచుకున్న రంగంలో ప్రావీణ్యతను సాధించడం తనకు అభిమతమని, ఎన్నో పోరాటాలు, ఒడిదొడుకులను అధిగమించి తాను ఈ స్థానానికి చేరుకున్నానని చెబుతూ పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యాసాగరరావు నియామకం విషయం తెలిసిన వెంటనే పార్టీ రాష్టక్రార్యాలయంలోనూ, బిజెపి ఇతర కార్యాలయాలతో పాటు కరీంనగర్ జిల్లాలో విద్యాసాగరరావు స్వాగ్రామం కోనారావుపేటలో నేతలు భారీ ఎత్తున సంబరాలు నిర్వహించి మిఠాయిలు పంచారు.

పార్టీ కార్యాలయంలోనూ విద్యాసాగరరావును అభినందనలతో ముంచెత్తారు. కేంద్ర పరిశ్రమల మంత్రి కల్‌రాజ్ మిశ్రా, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి, కొత్తగా పార్టీలో చేరిన కపిలవాయి దిలీప్‌కుమార్, డాక్టర్ కె. లక్ష్మణ్, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, ఎన్ రామచంద్రరావు తదితరులు విద్యాసాగరరావును ఘనంగా సత్కరించారు.

పార్టీ రాష్ట కార్యాలయంలో ఘనంగా సత్కారం

పార్టీ రాష్ట కార్యాలయంలో ఘనంగా సత్కారం

మహారాష్ట్ర గవర్నర్‌గా చెన్నమనేని విద్యాసాగర్ రావు
గవర్నర్‌గా నియమితులైన సిహెచ్ విద్యాసాగరరావు తనకంటూ ప్రత్యేక ఉనికిని ప్రదర్శించేవారు. ఏ అంశంపైన మాట్లాడినా లోతైన అధ్యయనం చేయడం, ఆ సమాచారాన్ని అందరితో పంచుకోవడం, అందుకు అవసరమైన పత్రాలను సేకరించడం, చరిత్రకు సంబంధించిన అంశాలను రికార్డు చేయడం విద్యాసాగరరావు దినచర్యగా మారింది.

పార్టీ రాష్ట కార్యాలయంలో ఘనంగా సత్కారం

పార్టీ రాష్ట కార్యాలయంలో ఘనంగా సత్కారం

మహారాష్ట్ర గవర్నర్‌గా చెన్నమనేని విద్యాసాగర్ రావు
పత్రికా సమావేశాల్లోనూ విభిన్నమైన అంశాలను ఎంచుకుని అందుకు సంబంధించిన కాపీలను పాత్రికేయులకు అందించడం ద్వారా తన ప్రత్యేకతను ప్రదర్శించేవారు.

పార్టీ రాష్ట కార్యాలయంలో ఘనంగా సత్కారం

పార్టీ రాష్ట కార్యాలయంలో ఘనంగా సత్కారం

మహారాష్ట్ర గవర్నర్‌గా చెన్నమనేని విద్యాసాగర్ రావు
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేసే సమయంలోనూ అప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నా, హోం శాఖ వ్యవహారాల్లో మాత్రం రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై తన వ్యక్తిగత అభిప్రాయాలను సూటిగా వెల్లడించేవారు.

పార్టీ రాష్ట కార్యాలయంలో ఘనంగా సత్కారం

పార్టీ రాష్ట కార్యాలయంలో ఘనంగా సత్కారం

మహారాష్ట్ర గవర్నర్‌గా చెన్నమనేని విద్యాసాగర్ రావు
విద్యాసాగరరావు విద్యాభ్యాసం వేములవాడ, కరీంనగర్ జిల్లాలో సాగింది. మెడిసిన్ చదువుకుందామని మహారాష్ట్ర నాంథేడ్‌కు వెళ్లారు. మెడిసిన్ కోసం సమయం వృధా చేసుకోవద్దని అనండంతో ఆయన బి.ఎస్సీ చదివారు.

పార్టీ రాష్ట కార్యాలయంలో ఘనంగా సత్కారం

పార్టీ రాష్ట కార్యాలయంలో ఘనంగా సత్కారం

మహారాష్ట్ర గవర్నర్‌గా చెన్నమనేని విద్యాసాగర్ రావు
తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించిన విద్యాసాగరరావు న్యాయవాదిగా మంచి పేరు ప్రతిష్టలు సాధించారు. ఆరెస్సెస్ రాజకీయ విభాగం జాతీయ జన సంఘ్‌కు 1972లో కరీంనగర్ జిల్లా శాఖ కన్వీనర్‌గా పనిచేశారు.

పార్టీ రాష్ట కార్యాలయంలో ఘనంగా సత్కారం

పార్టీ రాష్ట కార్యాలయంలో ఘనంగా సత్కారం

మహారాష్ట్ర గవర్నర్‌గా చెన్నమనేని విద్యాసాగర్ రావు
1975లో ఇందిరాగాంధీ విధించిన అత్యయక పరిస్థితిని వ్యతిరేకించి ఏడాదిపాటు ఆయన వరంగల్ జైలులో శిక్ష అనుభవించారు. 1980లో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుండి జనతా పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగి ఓడిపోయారు.

పార్టీ రాష్ట కార్యాలయంలో ఘనంగా సత్కారం

పార్టీ రాష్ట కార్యాలయంలో ఘనంగా సత్కారం

మహారాష్ట్ర గవర్నర్‌గా చెన్నమనేని విద్యాసాగర్ రావు
1985లో తెలుగుదేశం పార్టీతో పొత్తుపెట్టుకుని మెట్‌పల్లి నుండి అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు.

పార్టీ రాష్ట కార్యాలయంలో ఘనంగా సత్కారం

పార్టీ రాష్ట కార్యాలయంలో ఘనంగా సత్కారం

మహారాష్ట్ర గవర్నర్‌గా చెన్నమనేని విద్యాసాగర్ రావు
అసెంబ్లీలో పార్టీ శాసనసనాపక్షానికి ఆయన నాయకత్వం వహించారు. 1989లో తెలుగుదేశం పార్టీతో పొత్తుతో ఒక మారు, 1994లో పొత్తు లేకుండా మరో మారు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

పార్టీ రాష్ట కార్యాలయంలో ఘనంగా సత్కారం

పార్టీ రాష్ట కార్యాలయంలో ఘనంగా సత్కారం

మహారాష్ట్ర గవర్నర్‌గా చెన్నమనేని విద్యాసాగర్ రావు
1998లో బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 1998, 1999లలో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుండి గెలుపొందారు. వాజపేయి ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా , వాణిజ్యశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.

పార్టీ రాష్ట కార్యాలయంలో ఘనంగా సత్కారం

పార్టీ రాష్ట కార్యాలయంలో ఘనంగా సత్కారం

మహారాష్ట్ర గవర్నర్‌గా చెన్నమనేని విద్యాసాగర్ రావు
1998-99 మధ్య కాలంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ , సభా వ్యవహారాల సలహా సంఘం, ఫైనాన్స్ కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు.

పార్టీ రాష్ట కార్యాలయంలో ఘనంగా సత్కారం

పార్టీ రాష్ట కార్యాలయంలో ఘనంగా సత్కారం

మహారాష్ట్ర గవర్నర్‌గా చెన్నమనేని విద్యాసాగర్ రావు
2004లో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి తెరాస అధినేత కె. చంద్రశేఖరరావుచేతిలో ఓడిపోయారు.

పార్టీ రాష్ట కార్యాలయంలో ఘనంగా సత్కారం

పార్టీ రాష్ట కార్యాలయంలో ఘనంగా సత్కారం

మహారాష్ట్ర గవర్నర్‌గా చెన్నమనేని విద్యాసాగర్ రావు
2009లో అన్నకొడుకు చెన్నమనేని రమేష్‌పై వేములవాడ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో తిరిగి కరీంనగర్ నుండి లోక్‌సభకు పోటీ చేసి మరోమారు ఓడిపోయారు.

పార్టీ రాష్ట కార్యాలయంలో ఘనంగా సత్కారం

పార్టీ రాష్ట కార్యాలయంలో ఘనంగా సత్కారం

మహారాష్ట్ర గవర్నర్‌గా చెన్నమనేని విద్యాసాగర్ రావు
ఆగస్టు 26న ఆయన మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు.

English summary
An influential Velama leader from Karimnagar, the 73-year-old politician was instrumental in shaping up BJP in Telangana Senior BJP leader and former minister of state in home ministry Ch Vidyasagar Rao has been nominated as the governor of Maharashtra. Rao is known as a close associate of Prime Minister Narendra Modi for nearly two decades.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X