సినీ దంపతులు డా.రాజశేఖర్, జీవితల కారు డ్రైవర్ జూబ్లీ హిల్స్ వద్ద ఆ దంపతుల నివాసంలో గల సర్వెంట్ క్వార్టర్స్‌లో అనుమానాస్పద స్ధితిలో మరణించాడు. రాజశేఖర్ టెంపర్ మెంట్ తెలిసిన టీవీ మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. సర్వెంట్ క్వార్టర్స్ లో కొన్ని దృశ్యాలను చిత్రించారు. కానీ రాజశేఖర్ కోపగించుకుని ఆ క్యాసెట్ ను లాక్కోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది.
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సుధాకర్ (27) ఆ జంట డ్రైవర్‌గా ఇటీవల చేరాడు. జూబ్లీ హిల్స్, రోడ్ నంబ ర్ 78లో రాజశేఖర్ నివాసానికి చెందిన సర్వంట్ క్వార్టర్స్‌లో అతడు నివాసముంటున్నాడు. గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సుధాకర్ బుధవారం ఇంట్లో అపస్మారకంగా కనిపించాడని పోలీసులు చెప్పారు.
జూబ్లీ హిల్స్‌లో గల అపోలో ఆసుపత్రికి అతడిని తరలించగా అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. "సుధాకర్ మరణించగా ఆసుపత్రికి తీసుకురావటంతో దానిని ఒక మెడికో లీగల్ కేసుగా వైద్యులు నమోదు చేసుకున్నారు. సెక్షన్ 174 (అనుమానాస్పద మృతి) కింద ఒక కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం" అని జూబ్లీ హిల్స్ పోలీస్ ఇన్ స్పెక్టర్ కె.నర్సింగ్ రావు చెప్పారు.