వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వామి నిత్యానంద వేషంలో రవితేజ?

By Santaram
|
Google Oneindia TeluguNews

Ravi Teja
రవితేజ హీరోగా "రొమాంటిక్ రుషి" సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. మొదట "మిరపకాయ" అని టైటిల్ పెడదామనుకున్నారు. తర్వాత అది రొమాంటిక్ రుషిగా మారింది. ఇప్పుడు స్వామి నిత్యానంద ప్రాచుర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కథలో కొన్ని మార్పులు చేసినట్టు తెలిసింది. రవితేజను నిత్యానంద గెటప్ లో చూపిస్తూ, ఆ స్వామి ఈ సందర్భాల్లో తప్పులు చేయలసి వచ్చిందో చూపిస్తారట. రంజిత క్యారక్టెర్ కూడా ఆ సినిమాలో ఉంటుంది కానీ ఆ పాత్ర కూడా చివరికి మంచిదని తేలుతుందట.

ఆధ్యాత్మికమే ఒక మాయాలోకం. సినిమా లోకం అంతకంటే మాయా ప్రపంచం. కొత్త కథల కోసం పరితపిస్తున్న సినిమా రచయితలకు స్వామి నిత్యానంద లడ్డూలాగా కన్పించినట్టున్నాడు. కల్కి తో సహా స్వామీజీలందరినీ కమెడియన్లుగా పెట్టి రవితేజ (నిత్యానంద) ను హీరోగా చూపించి, రంజితను ఐటం గాళ్ గా చిత్రీకరిస్తే బాగుంటుంది. దొంగ స్వామిగా కోట శ్రీనివాసరావు బాగా సరిపోతాడు.

హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన చేయనున్న చిత్రానికి ఈ గమ్మత్తైన టైటిల్ ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మార్చి 25న లాంఛనంగా ఈ చిత్రం ప్రారంభం కానుంది. శేఖర్ కమ్ముల లీడర్ చిత్రంతో పరిచయమైన రిచా ఉపాధ్యాయ ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. యల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ...హరీష్ శంకర్ చెప్పిన కథ ఎక్సలెంట్ గా ఉంది. మేము ఎక్కడా ప్రొడక్షన్ విలువల్లో కాంప్రమైజ్ కాదల్చుకోలేదు. భారీ బడ్జెట్ లోనే ఈ చిత్రం రూపొందిస్తాము అంటున్నారు. ఇక ఈ చిత్రంలో మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. ఆర్ డి రాజశేఖర్ కెమెరా అందిస్తున్న ఈ చిత్రానికి కిక్ చిత్రానికి సంగీతం అందించిన తమస్ సంగీత సారధ్యం వహిస్తున్నారు. గౌతం రాజు ఎడిటింగ్,రామ్ లక్ష్మన్ యాక్షన్ కోసం ఎంపిక జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X