వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బావను కొట్టబోయి బోర్లా పడ్డ బావమరిది!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ram Charan Teja and Allu Arjun
హీరో అల్లు అర్జున్ తన బావ రామ్ చరణ్ తేజను కొట్టబోయి బోర్లాపడ్డాడు. అల్లు అర్జున్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ సైతం బోర్లా పడ్డాడు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ హీరోగా 2009లో వచ్చిన మగధీర చిత్రం తెలుగు ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన విషయం తెలిసిందే. మగధీర చిత్రం 223 కేంద్రాలలో వంద రోజులు నడిచింది. కేవలం మూడు వారాల్లోనే 48.83 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అల్లు అరవింద్ నిర్మాతగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించింది. అయితే ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడంతో అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ కళ్లు ఆ రికార్డుల మీద పడ్డట్టుగా కనిపిస్తోంది.

మగధీర రికార్డులు బద్దలు కొట్టే ఉద్దేశ్యంలో భాగంగానే అల్లు అరవింద్ తన తనయుడు అల్లు అర్జున్‌తో బద్రినాథ్ చిత్రం తీశారనే వాదనలు వినిపించాయి. సినిమా విడుదల సమయంలో సైతం మగధీరలా రికార్డులు సృష్టిస్తుందని పలువురు చెప్పారు. కానీ తీరా విడుదలయ్యాక బాక్పాఫీసు ముందు బోర్లా పడింది. భారీ చిత్రాల దర్శకుడు వి వినాయక్ బద్రీనాథ్ చిత్రాన్ని తెరకెక్కించినప్పటికీ ఆ చిత్రం మగధీరను కొట్టలేక పోయింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, అశ్వనీదత్ నిర్మాణంలో, మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన శక్తి సైతం మగధీరను కొట్టాలనుకున్న ఉద్దేశ్యంతో వచ్చిందనే భావన అందరిలోనూ ఉంది. కానీ అదీ బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది.

English summary
Hero Allu Arjun was failed to beat Magadheera records with Badrinath cinema.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X