వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధినాయకుడు చిరు కాదు, బాలయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi-Balakrishna
ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని దురదృష్టం ఇంకా వెంటాడుతున్నట్లే ఉంది. ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీని స్థాపించారో అప్పటి నుంచి ఒక్కటి అనుకుంటే మరోటి జరుగుతున్నట్లుంది. తాజాగా చిరంజీవి మరో అవకాశాన్ని కోల్పోయినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా చిరంజీవి 150వ చిత్రం కోసమే అధినాయకుడు టైటిల్‌ను ఖరారు చేసి, కథను కూర్చారు. నిజానికి, ఈ సినిమా ఎప్పుడో సెట్ మీదికి వెళ్లాల్సింది. కానీ, చిరంజీవి అనుకున్నట్లు అంతా జరగలేదు. కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీ విలీన ప్రక్రియకు నెలల తరబడి పడుతోంది.

చిరంజీవి తన 150వ చిత్రాన్ని చేస్తారో చేయరో తెలియని సందిగ్ధ స్థితిలో బాలకృష్ణ హీరోగా అధినాయకుడు టైటిల్‌తో ఓ సినిమా తెరకు ఎక్కుతున్నట్లు సమాచారం. ఈ టైటిల్‌ను బాలకృష్ణ రిజిష్టర్ చేయించారని కూడా అంటున్నారు. నిజానికి, బాలకృష్ణ నటిస్తున్న ఓ చిత్రానికి మహదేవనాయుడు అని పేరు పెడదామని అనుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే కోడి రామకృష్ణ దర్శకత్వంలో హరహర మహదేవ రూపుదిద్దుకుంటుంది. రెండు పేర్లు ఒకే రకంగా ఉంటాయనే ఉద్దేశంతో ఆ పేరు మార్చాలని అనుకున్నారట. మహదేవ నాయుడు పేరుకు బదులు బాలయ్య సినిమాకు అధినాయకుడు అని పేరు పెట్టినట్లు సమాచారం.

English summary
Latest buz is that Chiranjeevi has lost Adhinayakudu title for his 150th film. With that title a film is on with Balakrishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X