సిబిఐ ప్రకటన: గాంధీజీ మూడు కోతులు

శుక్రవారం, ఫిబ్రవరి 17, 2012, 10:03 [IST]
Monkeys
మీడియాకు సిబిఐ చేసిన విజ్ఞప్తిని గాంధీజీ మూడు కోతుల సామెతకు అన్వయిస్తూ ఓ ఆంగ్ల దినపత్రిక వ్యాఖ్యానించింది. చెవులు, కళ్లు, నోరు మూసుకుని ఉండే గాంధీజీ మూడు కోతుల సామెతను సిబిఐ ప్రకటన గుర్తు చేస్తోందని వ్యాఖ్యానించింది. ఇంతకీ అలా వ్యాఖ్యానించడానికి కారణమేమిటంటే - తమ వద్దకు వచ్చే వారి పేర్లను వెల్లడించకూడదని, వారు వచ్చిన విషయంపై రాయవద్దు, ప్రసారం చేయవద్దని సిబిఐ మీడియాకు విజ్ఞప్తి చేస్తూ ఓ ప్రకటన జారీ చేసింది. తమ వద్దకు వస్తున్న వ్యక్తులు దిల్‌కుషా అతిథి గృహం వద్ద మీడియా వాహనాలు పెద్ద యెత్తున మోహరించి ఉండడంపై ఫిర్యాదు చేస్తున్నారని చెప్పింది.

మీడియా వల్ల నిజాయితీపరులైన సాక్షులు తమ వద్దకు రావడానికి జంకుతున్నారని కూడా చెప్పింది. దానివల్ల విచారణకు విఘాతం ఏర్పడుతుందని చెప్పింది. హైదరాబాద్ సిబిఐ ఎస్పీ హెచ్ వెంకటేష్ పేర ఆ ప్రకటన జారీ అయింది. ఆ ప్రకటనను సిబిఐ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా పంపించింది. అయితే, ఆ ప్రకటన సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మినారాయణ పేరు మీద కూడా ఎస్పీ స్థాయి అధికారి వెంకటేష్ ఎందుకు జారీ చేశారని ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఐఎఎస్ అధికారుల గగ్గోలుతో సిబిఐ ఎస్పీ వెంకటేష్ ఆ ప్రకటన విడుదల చేసినట్లు భావిస్తున్నారు.
English summary
The CBI on Thursday made an unusual 'request' to the print and electronic media.
User Comments
Srsr Velagala 17 Feb 2012 07:29 pm
అవి ఎం చెప్పేవో తెలియదు కాని ఇప్పుడు మట్టుకు నిజం మేం గ్రహించం అంటే చూడము, నిజం మాకు వినబడదు అంటే వినము, ఇంకా నిజం మేము చెప్పము అంటే నిజం మాట్లాడం అనే కదా?దానికి గాంధీగారిని లాగడం ఎందుకో, మన సీనియర్ మంత్రులన్దారని జగన్ గురించి కడుపుటే అలాగే తెలియచేస్తారు. ఒకప్పుడు రాజులు బలవంతులైన బానిసలని సైన్యంగా మార్చుకుని ఏలుబడి సాగించేవారు, ఇప్పుడు నాగరికత కలిగిన స్వేచ్చలేని ఉద్యోగుల అండతో ఏలుబడి సాగిస్తున్నారు.
[ మీ వ్యాఖ్య రాయండి ]
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST