ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మరో ఊరట లభించింది. ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో ఆయన కోడలు, బాలకృష్ణ కూతురు బ్రాహ్మణికి ఓ విల్లా ఉంది. ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో విల్లాలు, స్థలాలు కొనుగోలు చేసినవారిని సిబిఐ ప్రశ్నించి, వాంగ్మూలాలు తీసుకుంది. ఇందులో భాగంగా బాలకృష్ణ తన కూతురు బ్రాహ్మణికి ఒకటి కొని బహుమతిగా ఇచ్చారు. దీంతో బ్రాహ్మణిని కూడా సిబిఐ అధికారులు ప్రశ్నించారు. ప్రభుత్వ ధర ప్రకారం చదరపు గజానికి ఐదు వేల రూపాయలకు మాత్రమే విల్లాలను, స్థలాలను అమ్మాల్సి ఉంటుంది. కానీ, వాటిని 50 వేల రూపాయలకు చదరపు గజం చొప్పున అమ్మారు.
మిగతా వారంతా చదరపు గజానికి 50 వేల రూపాయలు చెల్లించగా బ్రాహ్మణి స్థలానికి మాత్రం ఐదు వేల రూపాయలు మాత్రమే చెల్లించారట. సిబిఐ విచారణలో ఆ విషయం తేలింది. అంటే, బాలకృష్ణ కూతురు, చంద్రబాబు కోడలు బ్రాహ్మణి స్థలం చట్టబద్దంగా ఉందన్న మాట. అధిక ధరలకు విక్రయించడం ద్వారా సమకూరిన మొత్తంలో ఎపిఐఐసి వాటాను చెల్లించకుండా ప్రభుత్వ ఖజానాకు ఎమ్మార్ కేసు నిందితులు గండికొట్టారనేది ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో ప్రధాన ఆరోపణ.