వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యూహాత్మకంగా: ఇంటర్వ్యూలకు నారా లోకేష్ నో

By Pratap
|
Google Oneindia TeluguNews

Nara Lokesh
హైదరాబాద్: తెలుగుదేసం పార్టీ అధ్యక్షుడు నారా లోకేష్ పట్టు సంపాదించుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోంది. చంద్రబాబు పాదయాత్రను ఆయన రాజకీయ అక్షరాభ్యాసం కోసం వాడుకుంటున్నారు. మూడు రోజుల పాటు తండ్రితో కలిసి నడక సాగించిన లోకేష్ ఆకర్షణకు కేంద్ర బిందువుగా మారారు. అదే సమయంలో ప్రజల నాడిని తెలుసుకోవడానికి లోకేష్‌కు ఆ కొద్ది సమయం సరిపోయిందని అంటున్నారు. అంటే, ప్రజలతో, నాయకులతో, కార్యకర్తలతో ఎలా వ్యవహరించాలనే విషయంలో ఓ అవగాహన వచ్చిందట.

ఈ స్థితిలో నారా లోకేష్ ఇంటర్వ్యూ కోసం మీడియా సంస్థలు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, లోకేష్‌ ఎక్కడా మీడియాతో పిచ్చాపాటీ మాట్లా డటమే తప్ప, ఇంటర్య్వూలు ఇవ్వడం లేదు. ఇంటర్వ్యూ కావాలని జర్నలిస్టులు కోరుతున్నా వెంపర్లాడకుండా ‘నా దగ్గర ఏముందని ఇంటర్య్వూ ఇస్తా చెప్పండి. బాస్‌ (బాబు) జనంతో కలుస్తున్నారు. స్పందన ఎలా ఉందో మీరే చూసి రాయండి' అని సున్నితంగా తిరస్కరిస్తున్నారు.

అదే సమయంలో బాబు పాదయాత్రకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్న గరికపాటి, కంభంపాటి, రావుల, రేవంత్‌రెడ్డితో నిరంతరం మాట్లాడుతున్నారు. యనమల, ఎరన్న్రాయుడు, కె. కృష్ణమూర్తి, దాడి వంటి సీనియర్‌ నేతలతో మాట్లాడినప్పుడు ఆయన తాను పార్టీ అధ్యక్షుడి కుమారుడిగా కాకుండా, మామూలు నేతగా ఒక సాధారణ యువనేతగానే మాట్లాడుతున్నారట.

సాధ్యమైనంతవరకూ తన వల్ల పార్టీకి నష్టం జరగకుండా ఆయనే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేతల వద్ద బాబును బాస్‌, పెద్దాయనే అంటారు తప్ప, డాడీ అని ఎక్కడా అనరు. దీన్నిబట్టి లోకేష్‌ అడుగులు ఎలా ఉండబోతాయో మీరే అంచనా వేసుకోండి' అని ఓ సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు. బాబు పాదయాత్రకు సంబంధించి ఒక వెైపు నాయకులు చర్చల్లో మునిగిపోతే, అందులో పాల్గొనకపోయినా పాదయాత్ర ఎలా ఉండాలో లోకేష్‌ కూడా చాలారోజులు కసరత్తు చేశారు. పార్టీకి సంబంధించిన కొందరు యువనేతలతో నిరంతరం టచ్‌లో ఉన్న లోకేష్‌ , వారికీ పాదయాత్రకు సంబంధించి కొన్ని బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

English summary
It is said that Telugudesam party president N Chandrababu Naidu's son Nara Lokesh is in a bid to use his father's padayatra as a stepping stone in politics. He is declining to give interviews to media as a strategy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X