కెసిఆర్‌తో బాబు మళ్లీ దోస్తీ, నారాయణ భాష్యం

సోమవారం, ఫిబ్రవరి 20, 2012, 10:36 [IST]
Narayana
సీరియస్ రాష్ట్ర రాజకీయాల్లో సిపిఐ కార్యదర్శి కె. నారాయణ కామెడీ ట్రాక్ నడుపుతుంటారు. ఓ రకంగా ఆయన సృజనాత్మక పాత్ర పోషిస్తారు. మాంసాహారం కొంత కాలం పాటు రుచి చూడబోనని అంటారు. అరెస్టయి శ్రీలక్ష్మి ఎంత అందెగత్తెనో అంత అవినీతిపరురాలని వ్యాఖ్యానిస్తారు. చొక్కా విప్పేసి ప్రదర్శన చేస్తారు. టీ షర్టు వేసుకుని హాయిగా నడుస్తారు. నారాయణగారు లేకపోతే రాష్ట్ర రాజకీయాలు పూర్తి సీరియస్‌గా మారిపోయి బోర్ కొట్టేవేమోనని అనిపిస్తూ ఉంటుంది.

తాజాగా ఆయన అటువంటి కామెంటే ఒకటి చేశారు. సిపిఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా కొన్ని టీవీ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాలకు తనదైన భాష్యం చెప్పారు. 2014 ఎన్నికల్లో మహా కూటమి పనిచేయవచ్చునని ఆయన ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబజాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దోస్తీ కట్టారు. వచ్చే ఎన్నికల్లో కూడా అది సాధ్యం కావచ్చునని ఆయన చెప్పారు. రాజకీయాల్లో వెసులుబాట్ల గురించి బాగా తెలిసిన నారాయణ చేసిన వ్యాఖ్యలు నిజమవుతాయేమో, చూడాలి.
English summary
CPI secretary K Narayana said that Maha Kootam nay active again in 2014 election.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST