విజయవాడ: మంత్రి కన్నా లక్ష్మినారాయణ అనుచరులు మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో చేసిన హంగామాతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వందలాది మంది కన్నా లక్ష్మినారాయణ అనుచరులు విమానాశ్రయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు వార్తలు వచ్చాయి. తన నాయకుడికి స్వాగతం చెప్పడానికి భారీ కాన్వాయ్‌తో విమానాశ్రయంలోకి వచ్చి చేరారు. వారి డ్రామా దాదాపు నాలుగు గంటలపాటు నడిచింది. తమ మంత్రికి వ్యవసాయ శాఖను కేటాయించడం ద్వారా ప్రమోషన్ లభించడంతో సంతోషాన్ని పట్టలేక నానా హంగామా చేశారు.
విజిల్స్ వేస్తూ, డ్యాన్సులు చేస్తూ, గట్టిగా చప్పట్లు కొడుతూ తమ నాయకుడి రాకకోసం ఎదురు చూస్తూ నానా హంగామా సృష్టించారు. మంత్రి అనుచరులు దాదాపు 200 వాహనాల్లో విమానాశ్రయానికి వచ్చారు. అది ఓ ప్రదర్శన లాగా కనిపించింది. గృహ నిర్మాణ శాఖ నుంచి కన్నా లక్ష్మినారాయణను తప్పించి, ఆయనకు వ్యవసాయ శాఖను కేటాయించారు. వారి ఆగడాలకు ప్రయాణికులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, విమానాల్లో ప్రయాణాలు చేసే సంపన్నులైనా వారు మంత్రితో పోలిస్తే సామాన్యులే కదా.