మంత్రి వర్గ విస్తరణ, మంత్రుల శాఖల మార్పు ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు. తనకు విధేయులుగా ఉన్నవారికే తగిన స్థానాలు దక్కుతాయనే సంకేతాలను ఆయన మంత్రులకు, కాంగ్రెసు నాయకులకు పంపించారు. తనకు విధేయులుగా ఉండకపోతే అంతేనని కూడా తేల్చి చెప్పారు. తనపై గత కొంత కాలంగా యుద్ధం ప్రకటిస్తున్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు, తనను ఇరకాటంలో పెట్టేలా ప్రకటనలు చేస్తున్న ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డికి తన దెబ్బ రుచి చూపించారని అంటున్నారు. హోం శాఖను ఆశిస్తున్న దామోదర రాజనర్సింహకు అసలుకే ఎసరు పెట్టారు. ఆయన వద్ద ఉన్న వ్యవసాయ శాఖను పీకేసి కన్నా లక్ష్మినారాయణకు ఇచ్చారు. వైయస్ వివేకానంద రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఆ శాఖను దామోదర రాజనర్సింహకు కేటాయించారు. ఇప్పుడు కన్నా లక్ష్మినారాయణకు ఆ శాఖను కేటాయించి, తనకు అత్యంత ఆప్తుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డికి కన్నా వద్ద ఇప్పటి వరకు ఉన్న గృహనిర్మాణ శాఖను అప్పగించారు.
డిఎల్ రవీంద్రా రెడ్డి శాఖను రెండు చీల్చేశారు. వైద్య విద్య, 104, 108 సర్వీసుల శాఖలను కొత్తగా మంత్రి పదవి చేపట్టిన కొండ్రు మురళికి కేటాయించారు. ఈ శాఖలకు సంబంధించి డిఎల్ రవీంద్రా రెడ్డి ముఖ్యమంత్రితో విభేదిస్తూ వస్తున్నారు. ఆ తలనొప్పిని తొలగించుకోవడానికి తన మాట వినే కొండ్రు మురళికి అప్పగించారు. అలాగే, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ప్రసాద్ కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా చెక్ పెట్టారు. పి. శంకరరావు సబితా ఇంద్రారెడ్డి విషయంలో తనపై చేస్తున్న విమర్శలకు విరుగుడుగానే ఇది జరిగింది. ప్రసాద్ కుమార్ పి. శంకరరావు కుటుంబానికి బంధువు కావడం కూడా అందుకు ఉపయోగపడుతుంది. ఏమైనా, కిరణ్ కుమార్ రెడ్డి చాతుర్యాన్నే ప్రదర్శించారని చెప్పాలి.