క్రికెట్ క్రీడాప్రపంచంలో సచిన్ టెండూల్కర్‌కి మర్యాదస్థుడిగా, నియమాలకు కట్టుబడే వ్యక్తిగా పేరుంది. అయితే, ఆస్ట్రేలియా పర్యటనలో అతని ఆటతీరు ఇంత అధ్వాన్నంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. ఈ స్థితిలో టెండూల్కర్‌పై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. రిటైర్ కావడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టెస్టు మ్యాచుల్లో రాణించి, వన్డేల్లో విఫమైన మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను జట్టు నుంచి ఆస్ట్రేలియా ఒక్క దెబ్బతో తీసేసింది. భారత్ విషయంలో మాత్రం టెండూల్కర్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాడు.
వన్డేల్లో ఘోరంగా విఫలమైన రికీ పాంటింగ్ తనను జట్టు నుంచి తొలగించగానే వన్డే ఫార్మాట్లో ఇక ఆడకపోవ్చుచనని చెప్పుకున్నాడు. పాంటింగ్ జట్టు కెప్టెన్‌గా, ఆటగాడిగా తక్కువేమీ కాదు. రికార్డుల విషయంలో మాత్రమే టెండూల్కర్‌ది పాంటింగ్ మీద పైచేయి. ఈ రకంగా చూస్తే పాంటింగ్‌కు టెండూల్కర్ సరి రారా అనే అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు.