విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పొట్లూరికి చంద్రబాబు హామీ: పవన్ కళ్యాణ్ విసుగు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బిజెపితో పొత్తు ఉంటే విజయవాడ కాకుండా వేరే స్థానం కేటాయిస్తానని పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్‌కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పొట్లూరి వరప్రసాద్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో చెప్చారని సమాచారం. అది విన్న పవన్ కళ్యాణ్ కొంత విసుగు ప్రదర్శించినట్లు చెబుతున్నారు.

చంద్రబాబు హామీ చెప్పినప్పుడు - అది మీ ఇష్టం, నేనేం చేయగలను అని పవన్ కళ్యాణ్ పొట్లూరి వరప్రసాద్‌తో అన్నట్లు చెబుతున్నారు. ఎలాగైనా ఎన్నికల బరిలో నిలవాలనుకున్న పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ పడరాని అష్టకష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. పవన్‌కళ్యాణ్ అండతో విజయవాడ లోక్‌సభ స్థానానికి టీడీపీ టికెట్ ఆశించారు. అయితే అది బెడిసికొట్టింది.

 Chandrababu assurance to Potluri Varaprasad

దీంతో విజయవాడ నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ వద్ద బుధవారం ఆయన ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై సానుకూలత లభించకపోవడంతో గురువారం పవన్‌కళ్యాణ్‌ను మరోమారు పొట్లూరి కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి, టిడిపి పొత్తు బెడిసినందున తాను బిజెపి నుంచి విజయవాడ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తానని ప్రస్తావించారు. బిజెపికి తాను మద్దతునిస్తున్నందున పొట్లూరి ప్రతిపాదనపై సరేనన్నారని తెలిసింది.

బిజెపి నేత ప్రకాశ్ జవదేకర్‌తో పొట్లూరి వరప్రసాద్ మాట్లాడినప్పుడు ఆయన కూడా హామీనిచ్చినట్లు తెలిసింది. అయితే బిజెపి, టిడిపి మధ్య పొత్తులు లేకపోతేనే అవకాశం కల్పిస్తామని చెప్పినట్లు సమాచారం. రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగితే విజయవాడ స్థానం పొట్లూరికి లభించదు. పొత్తు ఉంటే వేరే స్థానం కేటాయిస్తానని చంద్రబాబు పొట్లూరికి హామీ ఇచ్చారట.

English summary
It is said that Jana sena chief and Telugu film hero Pawan Kalyan was unhappy with Potluri Varaprasad on getting assurance from Telugudesam party president Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X