వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌తో చిన్నాన్న: హీరో మహేష్‌ ఫ్యామిలీలో చిచ్చు

By Pratap
|
Google Oneindia TeluguNews

Differences in Mahesh Babu family
హైదరాబాద్‌: ప్రిన్స్ మహేష్ బాబు కుటుంబంలో చిచ్చు రేగింది. సూపర్‌స్టార్‌ కృష్ణ కుటుంబంలో చోటు చేసుకున్న ఈ విభేదాలు గుంటూరు లోక్‌సభకు తెలుగుదేశం పార్టీ అభ్యర్దిగా పోటీ చేస్తున్న మహేష్ బాబు బావ గల్లా జయదేవ్‌ కొంప ముంచుతుందనే ఆందోళనతో టిడిపి వర్గాలున్నాయి. గుంటూరు జిల్లా తెనాలి శాసన సభ నియోజకవర్గం నుండి టిడిపి తరపున పోటీ చేయాలనుకున్న కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావుకు నిరాశ ఎదురైంది. దీంతో ఆయన వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తన అండదండలు అందిస్తున్నారు.

అకస్మాత్తుగా ఆదిశేషగిరి రావు తీసుకున్న నిర్ణయం మహేష్ బాబు కుటుంబానికి సమస్యగా మారింది. తానే కాకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్ధులకు అవసరమైతే తన సోదరుడు కృష్ణ కూడా ప్రచారం చేస్తాడని శేషగిరి రావు ఆదివారం కాకినాడలో చేసిన ప్రకటనతో గల్లా కుటుంబం దిమ్మ తిరిగిందని అంటున్నారు. గుంటూరు జిల్లా కు స్ధానికేతరుడైనప్పటికీ గల్లా జయదేవ్‌ తన మామగారైన ఘట్టమ నేని కృష్ణ కుటుంబాన్నే నమ్ముకుని పోటీకి దిగారు.

ప్రత్యక్ష రాజకీయా లకు దశాబ్దాల క్రితమే దూరమైన కృష్ణ కుటుంబం తాజాగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అనుకుంది. కొంత కాలం ఆయన సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు మాత్రం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం పార్టీలోని తెర వెనుక రాజకీయాలు నడిపారు. వైయస్ మరణం తర్వాత ఆయన కూడా రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. అయితే, రాష్ట్ర విభజన నేపధ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి ఆదిశేషగిరి రావు రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు. అందుకు వేదికగా తెలు గుదేశం పార్టీని ఎంచుకున్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో మంత్రి గా పనిచేసిన గల్లా అరుణకుమారి, ఆమె కుమారుడు గల్లా జయదేవ్‌తో పాటు ఆదిశేషగిరి రావు కూడా టిడిపిలో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ నుండి అల్లుడు జయదేవ్‌, తెనాలి నుండి చిన్నమామగారు ఆది శేషగిరి రావు ఎన్నికల బరిలో నిలవాలనుకున్నారు. అయితే, జయదేవ్‌కు గుంటూరు లోక్‌సభ టిక్కెట్టు ఇచ్చిన టిడిపి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో గల్లా అరుణకుమారికి టిక్కెట్టు ఇచ్చింది. అంతేకాకుండా తెనాలిలో ఆదిశేషగిరి రావుకు టిక్కెట్టు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. దాంతో ఆదిశేషగిరి రావు జగన్ పార్టీ వైపు మళ్లారు.

అకస్మాత్తుగా ఆదిశేషగిరి రావు ఒక ప్రకటన చేశారు. కృష్ణ అభిమానులందరూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. దాంతో అభిమానుల్లో ఒక్కసారిగా అయోమయం మొదలైంది. పైగా కృష్ణ, మహేష్ బాబు అభిమానులతో ఆదిశేషగిరి రావు టచ్‌లో ఉన్నారు. మొత్తం మీద, ఆదిశేషగిరి రావు కారణంగా మహేష్ బాబు కుటుంబంలో అలజడి ప్రారంభమైంది.

English summary
It is said that, as Adiseshagiri Rao is supporting YS Jagan's YSR Congress super star Krishna's family in trouble.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X