వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కిరణ్ భేటీ వెనుక... టీడీపీని దూరం చేసేందుకే'

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డితో భేటీ కావడంపై మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత డొక్కా మాణిక్య వర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకునేందుకే కిరణ్ బీజేపీలో చేరేందుకు సన్నద్ధమవుతున్నారని ఆరోపంచారు. శనివారం ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ .. ఇప్పుడు అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుల్లో కిరణ్ తొలి వరుసలో ఉన్నారన్నారు. రాజకీయ నాయకుల వద్ద లిక్విడ్ క్యాష్ తక్కువగా ఉంటుందన్నారు.'

Dokka controversial comments on Kiran

కానీ లిక్విడ్ క్యాష్ ఎక్కువగా ఉన్న నేతల్లో కిరణ్ ఒకరన్నారు. ఈ లిక్విడ్ క్యాష్‌గా ఉన్న బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకునేందుకే కిరణ్ బీజేపీ వైపు చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నానని, ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలని కాంక్షిస్తున్నానని చెబుతూ వచ్చిన కిరణ్ .. రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చిన బీజేపీలో ఎలా చేరుతారని ప్రశ్నించారు.

ఈ చేరిక వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. బీజేపీలో చేరడం ద్వారా ప్రస్తుతం ఆ పార్టీతో మైత్రిని కొనసాగిస్తోన్న టీడీపీని దూరం చేయడమే కిరణ్ అసలు లక్ష్యమన్నారు. ఇదే సమయంలో తెలంగాణలోని కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిలతో మంతనాలు జరపడంలోనూ వేరే కారణాలున్నాయని, సామాజిక కోణంలో కిరణ్ పావులు కదుపుతున్నారని ఆరోపించారు.

English summary
Dokka Manikya Vara Prasada controversial comments on Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X