హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అజయ్ దేవగన్ సింగం రిటర్న్స్‌పై గుర్రు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటించిన సింగం రిటర్న్స్ చిత్రంపై హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం హిందూ నిష్ట సంస్థలు ఆందోళనకు దిగాయి.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అత్యంత మంచి సక్సెస్ సాధించిన 'సింగం' సీక్వెల్‌ను బాలీవుడ్‌లో 'సింగం రిటర్న్స్' పేరుతో తెరకెక్కించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఈ చిత్రంలో నటించాడు. దీనికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహించాడు.

హిందువులను చూపించినట్లు మిగతా మతాల గురువులను చూపించగలరా అని హిందూ సంస్థల ప్రతినిధులు ప్రశ్నించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా వారు ప్లకార్డులు ప్రదర్శించారు.

హిందూ నిష్ఠ సంస్థలు

హిందూ నిష్ఠ సంస్థలు

హిందూ మతగరువులను ఆవమానించారనే ఆరోపణపై హిందూ నిష్ఠ సంస్థలు ఆదివారంనాడు అజయ్ దేవగన్ నటించిన సింగం రిటర్న్స్ సినిమాపై ఆందోళకు దిగాయి.

ఇందిరా పార్కు వద్ద...

ఇందిరా పార్కు వద్ద...

సింగం రిటర్న్స్ సినిమాకు వ్యతిరేకంగా, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హిందూ సంస్థలు ఇందిరా పార్కు వద్ద ధర్నాకు దిగాయి

హిందూ ధర్మభావనను తుంగలో...

హిందూ ధర్మభావనను తుంగలో...

సింగం రిటర్న్స్ సినిమాలో హిందూ ధర్మభావనలను తుంగలో తొక్కారని, నిర్మాతపై, కథానాయకుడు అజయ్ దేవగన్‌పై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. సెన్సార్ బోర్డు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

ఆందోళన ఇలా...

ఆందోళన ఇలా...

హిందూ నిష్ఠ సంస్థల ప్రతినిధులు సింగం రిటర్న్స్ సినిమాకు వ్యతిరేకంగా హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద ఆందోళనకు దిగారు.

English summary
Hindu organisations staged dharna protesting against Ajay Devagan's Singam returns film in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X