వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూన్ 2: చంద్రబాబును కెసిఆర్ పిలవడం లేదట!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జూన్ 2న తన ప్రమాణ స్వీకారానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించడం లేదని తెలుస్తోంది.

చంద్రబాబు వద్ద మంత్రిగా పని చేసిన కెసిఆర్... ఆ తర్వాత తెలంగాణ కోసమంటూ తెరాసను స్థాపించారు. విభజన విషయంలో ఆయన చంద్రబాబును ప్రధానంగా లక్ష్యం చేసుకున్నారు. ఆయన పైన తిట్ల వర్షం కురిపించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, తెలంగాణలో కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతున్నారు.

K Chandrasekhar Rao not to invite Nara Chandrababu Naidu for swearing in

జూన్ 2న కెసిఆర్, 8న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముందుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కెసిఆర్.. చంద్రబాబును ఆహ్వానించడం లేదని తెలుస్తోంది. అయితే కేవలం చంద్రబాబుకు మాత్రమే ఆహ్వానం లేదని కాదు. ఇతర జాతీయ నాయకులను ఎవరినీ కూడా ఆహ్వానించడం లేదని సమాచారం.

ఒకవేళ కెసిఆర్ మనసు మార్చుకొని చంద్రబాబును ప్రమాణ స్వీకారానికి పిలిచినప్పటికీ... కెసిఆర్‌కు చంద్రబాబు నుండి మాత్రం ఆహ్వానం ఉండక పోవడం లేదా, ఉన్నా హాజరుకాకపోవడం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు జూన్ 8న గుంటూరులో ప్రమాణ స్వీకారం చేస్తారు. గుంటూరులో చేస్తున్నందున చంద్రబాబు ఆహ్వానించక పోవచ్చునని, ఆహ్వానించినా కెసిఆర్ వెళ్లకపోవచ్చునని చెబుతున్నారు.

English summary
As expected, Telangana CM-designate K Chandrasekhar Rao is not inviting his Seemandhra counter part N Chandrababu Naidu for his swearing-in as first Chief Minister of newly carved Telangana state on June 2.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X