మోడీపై ఖాన్ ప్రేమ: మామిడిపళ్లకు 'నమో ఆమ్'
కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన అభిమానంతో ఓ వ్యక్తి తన తోటలో పెంచుతున్న మామిడి పళ్లకు నమో మామిడి అని పేరు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హాజీ కలీముల్లా ఖాన్ మామిడిసాగులో పేరు పొందారు. తాను నూతనంగా అభివృద్ధి చేసిన కొత్త రకం మామిడికి 'నమో ఆమ్' అని పేరు పెట్టారు.
ప్రపంచ రాజకీయాల్లో మోడీ క్రియాశీలక పాత్ర పోషఇంచాలని కోరుతూ ఈ పనిని తాను చేసినట్లు కలీముల్లా ఖాన్ తెలిపారు. అతనిని మ్యాంగో కింగ్ అంటారు. మామిడి సాగులో అతను పేరు పొందారు. కలీముల్లా ఖాన్ గతంలో కొత్తగా అనేక సంకరజాతి మామిడి పండ్లను అభివృద్ధి చేశారు.
తాజాగా అభివృద్ధి చేసిన మామిడి పండు దుస్సేరి రకం కన్నా తీయగా ఉంటుందని తెలిపారు. దీనికి మోడీ పైన ఉన్న అభిమానంతో నమో ఆమ్ అని పేరు పెట్టినట్లు చెప్పారు.
మోడీ పేరు వినేందుకు తాము సంతోషిస్తామని చెప్పారు. మోడీ చాలా విజయవంతమైన, అందరిచే అభిమానించబడుతున్న నాయకుడు అన్నారు. నరేంద్ర మోడీ విజయం, నమో మామిడి పళ్లను కలకాలం ప్రజలు గుర్తుచుకుంటారని చెప్పారు. మనం చనిపోయినా గుర్తుంటాయన్నారు. నమో మామిడి పండును తాను మోడీకి అంద చేస్తానని చెప్పారు.