వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పివి అండనే లేకుంటే..: మన్మోహన్ కూతురు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూతురు దమన్ సింగ్ తన తండ్రిని పూర్తిగా సమర్థించింది. తాను రాసిన ఓ పుస్తకంలో తన తండ్రి గురించిన కొన్ని వాస్తవాలను బహిర్గతం చేశారు. తన తండ్రి రాజకీయాలకు సరిపోరని తాను భావించడం లేదన్నారు. అయితే, మోసపూరిత రాజకీయాలు, ఇతర అంశాలు తన తండ్రిని తేలికగా ఉంచలేక పోయాయన్నారు. అ

యితే, దేశంలో సంస్కరణలు తీసుకొచ్చే సమయంలో కాంగ్రెస్ లోనే తన తండ్రి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారని దమన్ చెప్పుకొచ్చారు. 'స్ట్రిక్ట్ లీ పర్సనల్, మన్మోహన్ అండ్ గురుశరన్' పేరుతో ఆమె ఓ పుస్తకం రాశారు. దానికి సంబంధించి ఓ ఆంగ్లదిన పత్రికకు ఆమె ఇంటర్వ్వూ ఇచ్చారు. తండ్రికి మద్దతుగా తనదైన వాదన వినిపించారు.

Manmohan faced resistance from within Cong: Daughter

రాజకీయాలకు తన తండ్రి సరిపోరని తాననుకోవడం లేదన్నారు. అప్పటి ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు నాన్నను పిలిచి రాత్రికి రాత్రే ఆర్థికమంత్రిగా చేశారని, అప్పటికే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు తన తండ్రి మన్మోహన్‌కు నెల గడువు మాత్రమే ఉందన్నారు.

పీవీయే లేకుంటే 1991 బడ్జెట్ సమయంలో మన్మోహన్ ఏమి చేయలేకపోయేవారని, మన్మోహన్‌కు పూర్తి మద్దతుగా నిలిచారని వెల్లడించారు. ఇక 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటే తన తండ్రి నమ్మలేకపోయారన్నారు. ఇలా మన్మోహన్‌కు సంబంధించిన పలు వ్యక్తిగత విషయాలను కూతురు ఆ పుస్తకంలో సవివరంగా తెలిపారు.

English summary
At a time when Manmohan Singh’s prime ministership has come under the scanner, the former PM’s daughter Daman Singh has sprung to her father’s defence with her book
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X