వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొన్న భూకంపమని, నిన్న చనిపోతారని (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలోని వివిధ జిల్లాల్లో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. మొన్న రాత్రి భూకంపం వస్తుందని ఉత్తర తెలంగాణలోని ప్రజలు రాత్రంతా జాగారం చేస్తే, నిన్న బుధవారం రాత్రి దక్షిణ తెలంగాణలోని ప్రజలు పడుకుటే చనిపోతారనే వదంతులతో జాగారం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో కూడా బుధవారం రాత్రి అదే పరిస్థితి.

పడుకున్నవారంతా చనిపోతారనే వదంతులతో వదంతులతో నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పలు చోట్ల ప్రజలు రాత్రంతా మేల్కొనే ఉన్నారు. వీధుల్లోకి వచ్చారు ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి, నల్లగొండ జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్ శాసనసభా నియోజకవర్గాల్లో, నేరేడుచర్ల, దామచర్ల, నాంపల్లి, జాజిరెడ్డిగూడెం మండలాల్లో ప్రజలు రాత్రంతా జాగారం చేశారు.

వరంగల్ జిల్లాలోని డోర్నకల్, కురవి, మరిపెడ, నరసింహులుపేట, ముగులు, మహబూబాబాద్, నర్సంపేట, రేగొండ, ఖానాపూర్ మండలాల్లో వదంతులు వ్యాపించాయి. ఫోన్ల ద్వారా వదంతులు ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపించాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

భూకంపం భయం

భూకంపం భయం

భూకంపం వస్తుందనే వదంతులు వ్యాపించడంతో నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో మంగళవారం రాత్రి ప్రజలు ఇలా జాగారం చేశారు.

భూకంపం భయం

భూకంపం భయం

భూకంపం వస్తుందనే వదంతులు వ్యాపించడంతో మంగళవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలు నిద్రకు దూరమై ఇలా జాగారం చేశారు.

భూకంపం భయం

భూకంపం భయం

భూకంపం వస్తుందనే పుకార్లు వేగంగా షికార్లు చేయడంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ప్రజలు మంగళవార రాత్రి నిద్ర పోకుండా వీధుల్లోకి వచ్చారు.

భూకంపం భయం

భూకంపం భయం

నిద్రపోతే భూకంపం మింగేస్తుందని భయపడిన ప్రజలు పిల్లాపాపలతో సహా ఇలా నిద్రకు దూరమై మంగళవారం రాత్రి ఇలా కనిపించారు.

భూకంపం భయం

భూకంపం భయం

తెలంగాణను భూకంపం ముంచేస్తుందనే వదంతులు చెలరేగడంతో పెద్దలు, పిల్లలు రాత్రంతా మేల్కొని ఇలా కూర్చున్నారు.

భూకంపం భయం

భూకంపం భయం

నిజామాబాద్ జిల్లాలో భూకంపం వస్తుందనే పుకార్లు ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపించాయి. దీంతో ప్రజలు వీధుల్లోకి వచ్చారు.

భూకంపం భయం

భూకంపం భయం

పుకార్లు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయో తెలియదు దానీ ప్రజలు నిద్రకు దూరమై మంగళవారం రాత్రి వీధుల్లో గడిపారు.

భూకంపం భయం

భూకంపం భయం

నిజామాబాద్ జిల్లా బోదన్‌లో ప్రజలు నిద్రకు వెలియై, పుకార్ల భయంతో వీధుల్లో గడిపారు. పిల్లలకు మాత్రం సరదాగానే ఉన్నట్లుంది.

English summary

 People in Warangal, Khammam, Nalgonda districts without sleep in the night as unwanted rumors spread.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X