వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ క్యాంప్ ఆఫీస్‌కు రూ. 26 కోట్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కోసం నిర్మించ తలపెట్టిన క్యాంప్‌ ఆఫీసు, నివాస సముదాయాల కోసం రూ.26.16 కోట్ల అంచనా వ్యయంతో రోడ్లు, భవనాల శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటికి సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపితే, కొత్త భవనాల నిర్మాణ పనులను అధికారులు ప్రారంభించనున్నారు.

ఇదిలావుంటే, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో హయాంలోనే అత్యాధునిక సౌకర్యాలతో సీఎం క్యాంపు కార్యాలయంతో పాటు నివాస సముదాయం నిర్మించారు. అయితే ఆ క్యాంపు కార్యాలయంలో వాస్తు దోషం ఉందనే కారణంతో కేవలం నివాస సముదాయాన్ని మాత్రమే కెసిఆర్ వినియోగిస్తున్నారు.

Rs 26 crores to KCR camp office

పాత క్యాంపు ఆఫీసు, నివాస సముదాయాల కంటే మరింత విశాలంగా కొత్త క్యాంపు కార్యాలయం, సీఎం ఆఫీసు నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వాహన శ్రేణిలో అన్ని కార్లు తెల్ల రంగులోకి మారాయి. తొలి దశలో మూడు వాహనాల్ని తెలుపు రంగులోకి మార్చిన అధికారులు తాజాగా సీఎం వాహన శ్రేణిలోని మిగతా ఫార్చునర్‌ కార్లను తెలుపురంగులోకి మార్చారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao's camp office will be constructed with Rs 26 crores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X