వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాజపేయి=గాంధీ: బోస్ లాంటి వారు మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజపేయి.. ఇద్దరూ ఒకటేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నాయకుడు ఇంద్రేష్‌కుమార్ అన్నారు. ఆయన శుక్రవారం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అటల్ బిహారీ వాజపేయి మహాత్మాగాంధీతో సమానమయితే.. నరేంద్ర మోడీ.. సుభాష్‌చంద్రబోస్ లాంటి వారని అన్నారు.

రాష్ట్రీయ స్వయక్ సేవక్ సంఘ్‌ను మతతత్వ శక్తిగా పోల్చినవారంతా మూర్ఖులని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి అత్యధిక ఓట్లు వచ్చేలా ఆరెస్సెస్ ప్రచారం చేస్తోందని అన్నారు. 100 శాతం ఓటింగ్ అయ్యేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్‌ తొగాడియా వంటి అతివాదుల మాటలకు అవకాశం లేదన్నారు.

 RSS compares Modi to Subhash Chandra Bose, Vajpayee to Mahatma Gandhi

నరేంద్ర మోడీ వ్యక్తిగత జీవితంతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ పోల్చుకోవడం సరికాదని, మోడీ భార్య యశోదాబెన్ ఎపిసోడ్‌తో లవ్ ఎఫైర్‌కు పోలిక పెట్టొద్దని ఇంద్రేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, దిగ్విజయ్ సింగ్ ఓ టీవి యాంకర్‌తో ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత ఆమెను వివాహం చేసుకుంటానని కూడా దిగ్విజయ్ సింగ్ ఇటీల ప్రకటించారు.

నరేంద్ర మోడీ జోగి అయితే, దిగ్విజయ్ భోగి అని ఇంద్రేష్ కుమార్ చురకలు అంటించారు. మోడీతో బిజెపి అగ్ర నేత ఎల్‌కే అద్వానీకి సమస్య లేదని, ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంపైనే ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారని వివరించారు.

English summary

 Rashtriya Swayamsevak Sangh leader Indresh Kumar on Friday hit out at people calling the RSS communal. In an interview to CNN-IBN, Indresh Kumar said that BJP Prime Ministerial candidate Narendra Modi is like former PM Atal Bihari Vajpayee, comparing them to Subhash Chandra Bose and Mahatma Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X