హైదరాబాద్: బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మార్కులు కొట్టేశారు. ఇటీవలే ఆస్ట్రేలియన్ సూపర్ సిరీస్ నెగ్గి సైనా నెహ్వాల్ మంచి ఊపు మీద ఉన్నారు. ఆమె ఏం మాట్లాడినా అది వార్తే అవుతుంది. అయితే, చాలా సిగ్గరిగా కనిపించే సైనా షారూక్‌కు నచ్చే కామెంట్ చేశారు.
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ సెక్సీయెస్ట్ పర్సన్ అని ప్రకటించేశారు.. పైగా షారూఖ్ వెరీ స్మార్ట్ అంటూ కితాబు ఇచ్చేశారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆ వ్యాఖ్యలు చేశారు. మహేష్ భట్ తన జీవితకథను సినిమాగా మలుస్తున్నట్టు వచ్చిన వార్తలపై కూడా ఆమె స్పందించారు.
దాని గురించి పెద్దగా వివరాలేమీ తెలియవని చెప్పేశారు. ఇటీవలే ఓ లైఫ్ స్టైల్ మ్యాగజీన్ సైనాను 'సెక్సీయెస్ట్ ఉమన్ ఆఫ్ ఇండియా' జాబితాలో చేర్చడం విశేషం. ఆస్ట్రేలియన్ సూపర్ సిరీస్‌లో అద్భుత ఆటతీరును ప్రదర్శించిన సైనా నెహ్వాల్ టైటిల్ విన్నర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
సైనా బ్యాడ్మింటన్‌లో భారత్‌కు విశేషమైన కీర్తిని తెచ్చిపెట్టారు. హైదరాబాద్‌కు చెందిన సైనా నెహ్వాల్ పుల్లెల గోపిచంద్ వద్ద శిక్షణ తీసుకున్నారు.