వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హర్షవర్ధన్: నిన్న కండోమ్స్, నేడు సెక్స్ విద్య

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కండోమ్స్ ధరించాలనే ప్రచారం చేయడం కన్నా వైవాహిక జీవితంలోని లైంగిక జీవితాన్ని అనుభవించాలనే ప్రచారం ఎయిడ్స్ నిరోధానికి మంచిదంటూ ప్రకటన చేసి వివాదం సృష్టించిన కేంద్ర ఆరోగ్య మంత్రి మరో వివాదాస్పద ప్రకటన చేశారు. పాఠశాలల్లో లైంగిక విద్యా బోధనను నిషేధించాలని ఆయన అభిప్రాయపడ్డారు

తన వెబ్‌సైట్‌లో లైంగిక విద్యా బోధనపై ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో కాల్డ్ సెక్స్ ఎడ్యుకేషన్‌ను నిషేధించాలని ఆయన త డిఆర్‌హర్షవర్ధన్ డాట్ కామ్‌లో రాశారు. విలువలతో కూడిన విద్యను అందించాలని, భాత సాంస్కృతిక సంప్రదాయాలపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.హర్షవర్ధన్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.

Sex education in schools should be banned, Harsh Vardhan says

ఎయిడ్స్‌ను నిరోధించడానికి కండోమ్స్ ధరించాలనే ప్రచారం మాత్రమే సరిపోదని భారత ఆగోర్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. అమెరికా ఆరోగ్య మంత్రి సిల్వియా మాథ్యూస్ బుర్వెల్‌ను కలవడానికి అమెరికాలో ఉన్న డాక్టర్ హర్షవర్ధన్ కండోమ్ ధారణపై వివాదాస్పద వ్యాఖ్య చేశారు.

ఎయిడ్స్ నిరోధ ప్రచారానికి కండోమ్ ధారణ ప్రచారంపైనా ఆధారపడ కూడదని, కండోమ్ ధరించినంత వరకు ఎటువంటి అక్రమ లైంగిక సంబంధానికైనా పాల్పడవచ్చుననే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

English summary
After suggesting that to prevent AIDS fidelity in marriage was better than use of condoms, health minister Harsh Vardhan has generated another controversy - this time by stating in his website that sex-education in schools should be banned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X