వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిడుగు: తెలంగాణ సిఎస్ రాజీవ్ శర్మ ఎపికి

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana CS allocated to AP
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. అఖిల భారత సర్వీసు అధికారుల విభజనలో భాగంగా అది జరిగింది. ఐఎఎస్ అధికారుల విభజన రాజీవ్‌ శర్మపై పిడుగులా పడింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజీవ్‌ శర్మ స్థానికేతరుడి కేటగిరీలో ఉన్నారు.

రోస్టర్‌ బ్యాండ్‌ ప్రకారం కేటాయింపులు ప్రారంభించగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వచ్చారు. రాజీవ్‌ శర్మ కూడా ఆంధ్రప్రదేశ్‌కే ఎంపికయ్యారు. దీంతో, అధికార యంత్రాంగంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. విషయం తెలుసుకున్న రాజీవ్‌ శర్మ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో చర్చించారు.

ఏం ఫర్వాలేదని రాజీవ్ శర్మకు భరోసా ఇచ్చిన కెసిఆర్ ఆదివారం రాజ్‌భవన్‌లో జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఆ అంశాన్ని ప్రస్తావించారు. ‘ఒకవేళ మా చీఫ్‌ సెక్రటరీ, డీజీపీ ఆంధ్రాకు నియమితులైనా వారిని మాకే ఇవ్వండి' అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు.

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజీవ్‌ శర్మ ఆంధ్రాకు వస్తే ఇక్కడ ప్రధాన కార్యదర్శి పోస్టు ఇవ్వడం కుదరదని, దీంతో పరిస్థితిని అర్ధం చేసుకున్న చంద్రబాబు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, తెలంగాణ సిఎస్‌, డిజిపి ఇద్దరూ తమ రాష్ట్రానికి వచ్చినా తిరిగి తెలంగాణకు బదిలీ చేయడానికి వీలుగా నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) ఇవ్వడానికి తనకేం అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

English summary
In a part of the division of All India civil service officers Telangana CS Rajeev Sharma has been allocated to Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X