వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి అధ్యక్షరాలిగా షర్మిల వద్దు: జగన్, వారైతేనే..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలంగాణ పార్టీ నేతలు ప్రశ్నల వర్షం కురిపించారు. ‘అసలు తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందా? లేక అధికార పార్టీలో విలీనమైందా? మేము వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులమా? లేక అధికార పార్టీలో విలీనమైన నేతలమా?' అని తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు.

శుక్రవారం వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీ సభ్యులతో ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. దాదాపు మూడున్నర గంటలపాటు వారితో చర్చలు జరిపారు. ఏపిలో ప్రతిపక్షంగా ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నా.. తెలంగాణలో ప్రభుత్వ విధానాలపై స్పందించకపోవడం వల్ల ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతున్నామని కమిటీ సభ్యులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వెళ్లిపోయినా పార్టీ నాయకత్వం కనీసం స్పందించలేదని, ఎన్నికలు పూర్తయినప్పటి నుంచీ ఎలాంటి సమీక్షలు లేవనీ, తెలంగాణలో పార్టీ గురించి పట్టించుకున్నా దాఖలాలే లేవని తమ వాదనను వినిపించారు.

YS Jagan didn't agree for Sharmila as Telangana YSRCP president

దీంతో వారిలో జగన్ ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. తెలంగాణలో కూడా పార్టీ ఉంటుందనీ, బోపేతం చేసే ప్రయత్నం చేద్దామని వారితో జగన్ చెప్పారు. తెలంగాణ పర్యటించాలని నేతల కోరగా.. ఏపిలో ప్రతిపక్ష నేతగా ఉన్నందున అక్కడే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందని, అవసరాన్ని బట్టి తెలంగాణలో కూడా పర్యటిస్తానని జగన్ వారికి తెలిపారు. దసరా తర్వాత తెలంగాణలో పార్టీ బలోపేతానికి కార్యాచరణ సిద్ధం చేద్దామని కమిటీ సభ్యులతో జగన్మోహన్ రెడ్డి చెప్పారు.

ఇది ఇలా ఉండగా తెలంగాణలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఇవ్వాలనే దానిపై కూడా చర్చకు వచ్చింది.
కొందరు ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అధ్యక్షుడిగా చేయాలని ప్రతిపాదించగా.. అందుకు శ్రీనివాసరెడ్డి సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాగా, మరికొందరు వైయస్ జగన్ సోదరి షర్మిళను అధ్యక్షురాలిగా ప్రకటించాలని కోరగా.. అందుకు జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదు. అధ్యక్షుడిగా తెలంగాణ వ్యక్తి ఉంటే బాగుంటుందని ఆయన అన్నారు.

అవసరమైతే తెలంగాణలో స్టార్ క్యాంపెయినర్‌గా షర్మిల కార్యక్రమాలు చేపడతారని జగన్ చెప్పారు. తాను కూడా తెలంగాణ జిల్లాలో పర్యటిస్తానని కమిటీ సభ్యులకు జగన్ చెప్పారు. అక్టోబర్ 8న జరిగే రాష్ట్రస్థాయి సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని లేదా నల్గొండ జిల్లా కన్వీనర్ గట్టు శ్రీకాంత్ రెడ్డికి అధ్యక్ష పదవిని కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మిగితా కార్యవర్గాన్ని కూడా అప్పుడే ప్రకటించనున్నారు.

English summary
YS Jaganmohan Reddy didn't agree for his sister Sharmila as Telangana YSRCP president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X