లోగుట్టు
కిరణ్ కుమార్ రెడ్డికి ట్విస్టు ఇచ్చిన ఆజాద్?మంత్రి వర్గ విస్తరణ విషయంలో ఓ ట్విస్టు ఇచ్చి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కొద్దిగా కలవరానికి గురి చేశారు. విస్తరణపై ఆదివారమంతా డ్రామా నడిచింది. సీఎం కిరణ్ ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ తన విశ్రాంతి గదిలో ఏకాంతంగా గడిపారు. రోజు మొత్తం మీద
బాలకృష్ణకు దగ్గరవుతున్న హీరో రాజశేఖర్?శత్రువు శత్రువు మిత్రుడు అనే సూత్రాన్ని హీరో రాజశేఖర్ అనుసరిస్తున్నట్లే కనిపిస్తున్నారు. చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన తర్వాత రాజశేఖర్ ఏ రాజకీయ పార్టీలోనూ లేకుండా పోయారు. చిరంజీవి రావడం వల్లనే తాము కాంగ్రెసు నుంచి బయటకు వచ్చామని ఆయన చెప్పుకున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వద్ద ఆయనకు
కిరణ్ కుమార్ రెడ్డిపై మేడం సోనియా గుర్రుసమాచార కమీషనర్ల నియామకం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తల మీదికి వచ్చింది. అన్నీ రాజకీయ నియామకాలే అని తేలడంతో ఆయన పార్టీ అధిష్టానం నుంచి ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సూచించినవారికి, శానససభ్యుడు చిరంజీవి సూచించినవారికి ఆయన కమీషనర్ల పదవులు కట్టబెట్టిన విషయం అధిష్టానం దృష్టికి వచ్చింది.
సిబిఐ ముందుకు మరో వైయస్ జమానా అధికారి?వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించిన మరో ఉన్నతాధికారి కూడా సిబిఐ ముందుకు విచారణ నిమిత్తం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసినన పి. రమాకాంత్ రెడ్డిని సిబిఐ విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో రమాకాంత్ రెడ్డి చీఫ్ సెక్రటరీగా పనిచేశారు.
వారిద్దరికీ చిరంజీవి హవా వల్లనే?సమాచార కమిషనర్ల నియామకంలో కాంగ్రెసు శాసనసభ్యుడు చిరంజీవి హవా నడిచినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం 8 మంది సమాచార కమిషనర్లను నియమించింది. మెజారిటీ వాటా మాత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దక్కించుకున్నారు. రాజకీయ నాయకుల పైరవీలకు అనుగుణంగా కమిషనర్ల నియామకం జరిగిందనే విమర్శలు అప్పుడే ప్రారంభమైంది. ఎం. రతన్, ఎస్, ప్రభాకర్ రెడ్డి, ఎల్
వరంగల్లులో దెయ్యం పచార్లు?వరంగల్ దెయ్యం భయంతో వణికిపోతోంది. రాత్రి వేళల్లో దెయ్యం తిరుగుతోందంటూ వరంగల్లులో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇందుకు సంబంధించి వరంగల్, సుబేదారి పోలీసు స్టేషన్లలో కేసులు కూడా నమోదైనట్లు సమాచారం. ఏడు అడుగుల దెయ్యం ఊరంతా పచార్లు చేస్తోందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నీడలాగా దెయ్యం తిరుగుతుందని అంటున్నారు. కర్రలు పట్టుకుని దెయ్యాన్ని వెంటాడడానికి ప్రయత్నించినవారు కూడా
గాలి పిఎ అలీఖాన్ ఆస్తి కోట్లపైనేఅక్రమ మైనింగ్ కేసులో జైలు ఊచలు లెక్కిస్తున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మెహఫుజ్ అలీఖాన్ తక్కువేమీ తినలేదట. అతని ఆస్తుల విలువ రూ. 250 కోట్ల పైనే ఉంటుందని ఆదాయం పన్ను శాఖ అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అలీ బళ్లారి నివాసంలో 2010లో ఆదాయం శాఖ అధికారులు
సునీల్ రెడ్డి విచారణ, పలుకు బంగారంఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో అరెస్టయిన సునీల్ రెడ్డి నుంచి సమాధానాలు రప్పించడం సిబిఐకి తలకు మించిన పనే అవుతోందట. సిబిఐ అధికారులు శనివారం సునీల్ రెడ్డిని తమ కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. చిరునవ్వును ముఖంపై పులుముకుని మాట్లాడకుండా ఉండడాన్ని సునీల్ రెడ్డి ప్రత్యేకంగా అభ్యాసం చేశాడా అనిపించేలా అతను వ్యవహరిస్తున్నాడని సమాచారం. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు
చంద్రబాబుతో బాలయ్య విభేదిస్తున్నారా?తమ పార్టీ అధ్యక్షుడు, బావ నారా చంద్రబాబు నాయుడితో తెలుగుదేశం పార్టీ నాయకుడు, సినీ హీరో బాలకృష్ణ విభేదిస్తున్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. చంద్రబాబు ఒకటి తలిస్తే బాలకృష్ణ మరోటి తలుస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలకృష్ణ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోరని చంద్రబాబు ప్రకటించిన తర్వాత కూడా తాను ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా
రేణుకా చౌదరి తెలంగాణ కార్డుమాజీ పార్లమెంటు సభ్యురాలు రేణుకా చౌదరి తెలంగాణ కార్డును వాడుకోవడానికి సిద్ధపడ్డారు. రాజ్యసభ సీటును దక్కించుకోవడానికి ఆమె తెలంగాణ కార్డును వాడుతున్నారు. ఇటీవల కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ హైదరాబాదు వచ్చినప్పుడు ఆమె అల్పాహార విందు ఇచ్చారు. ఈ అల్పాహార విందుకు తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులను, కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులను ఆహ్వానించారు.