వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దసరా: ఒకే రోజు రెండు తిథులు, అందుకే..

By Pratap
|
Google Oneindia TeluguNews

కొన్ని రామాయణములననుసరించి రావణ సంహారం చేసిన తర్వాత విజయము పొందిన దినంగా,
భారతాన్ననుసరించివిరాటరాజు దగ్గర అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్న పాండవులు గోగ్రహణ యుద్ధంలో గెలిచి,
తద్వారా కురుక్షేత్ర యుద్ధంలో విజయానికిఆరంభ సూచకంగా విజయము పొందిన రోజుగా, మార్కండేయ పురాణం దేవీమాహాత్మ్యం లో చెప్పినట్టుగా మూడు విడతలుగా సప్తమాతృకలతో కలిసి, అజ్ఞానంతో సరస్వతీ రూపంతోయుద్ధంచేసి,దరిద్రంతో లక్ష్మీ రూపంతో, పాపపు శక్తి తో శక్తిరూపంగా, శుంభనిశుంభులు, మహిషాసురుడు, భండాసురుడు మొదలైన వారితో యుద్ధంచేసి పొందిన విజయంగా చెప్పిన విజయదశమి ఈసంవత్సరం కొంత వైవిధ్యతిథులో వచ్చింది.

పుణ్యకార్యాలకు తిథిని సూర్యోదయాన్ననుసరించి ఆయా సమయపు పరిమితినిబట్టి ఉంటుంది. పితృకార్యాలకు అపరాహ్నపు సమయంలో తిథి ఉండాలి. సాయం వ్రతాది నియమాలు ( సంకష్ట చతుర్థి వోటి వాటికి )తిథి సాయంకాలంలో ఉండాలి. ఒకేరోజు రెండు తిథులు వచ్చినపుడు అది సంయుక్త తిథి (తిథి ద్వయం) అంటారు.

పాడ్యమి నుండి ప్రతిరోజు 25.09.2014 నుండి కమ్రంగా వచ్చింది, కానీ నవమి దశమి కలసివచ్చి 03.10.2014 మరుసటి రోజుకు లేనికారణంగా 3వ తేదీన మహర్నవమి, విజయదశమిని రెండిరటికి కలిపి పండుగగా జరుపు కోవాలి.

Importnace of Dasara festival

# విజయ దశమినాడు చేయవలిన పనులు

# నవరాత్రులలోని 9 రోజులూ అమ్మవారి పూజలు చేయడం,

# విజయదశమినాడు కొత్త బట్టలు ధరించడం, దానధర్మాలు చేయడం

# శమీ వృక్షం (జమ్మి చెట్టు) ని పూజించాలి.

# పెద్దల, గురువుల, దేవతలద్వారా ఆశీర్వాదాలు పొందాలి.

English summary

 A qualified astrologer Maruthi Sharma explained the importance of Dasara.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X