వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

8న చంద్రగ్రహణం: ఏం చేయకూడదు?

By Pratap
|
Google Oneindia TeluguNews

గ్రహణం ఆశ్వీయుజ శుక్ల పూర్ణిమ బుధవారము అనగా 08 అక్టోబర్‌ 2014 రోజున రేవతీ నక్షత్రంలో మీనరాశిలో కేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తుంది.

స్పర్శ కాలం మధ్యాహ్నం 02.44
మధ్య కాలం మధ్యాహ్నం 04.24
సూర్యాస్తమయం (హైదరాబాదు) సాయంత్రం 05.56
మోక్షకాలం సాయంత్రం 06.05

నిత్యభోజన ప్రత్యాబ్దీకాలు

సూర్యగ్రహేతు నాశ్నీయా త్పూర్వం యామ చతుష్టయమ్‌ ।
చన్ద్రగ్రహేతు యామాం స్త్రీన్‌ బాలవృద్ధాతురాన్వినా ॥

యామము అనగా 3 గంటలు . గ్రహణము జరిగే యామానికి ముందు 3 యామములు (అనగా 9గంటలు) పగలు భోజనము చేయకూడదు. నిత్యభోజనాదులు శుద్ధ బింబమునూ చూసిన తర్వత చేసుకోవాలి.

What is Grahanam in Jyothisham?

గ్రహణ గోచారము

రేవతీ నక్షత్రమువారు ఈగ్రహణమును చూడరాదు.
వృషభ , మిథున , తుల , మకర రాశుల వారికి శుభ ఫలితము
కర్కాటక , కన్య , వృశ్చిక , కుంభ రాశుల వారికి మధ్యమ ఫలము
మేష , సింహ , ధను , మీన రాశుల వారికి అధమ ఫలము
పాటించవలసిన నియమాలు

శుభఫలము ఉన్న రాశివారు అనుష్ఠానాదికాలు చేసుకొనడానికి సరైన సమయంగా తెలుసుకోవాలి.
మధ్యమ ఫలము ఉన్నవారు మరియు అధమ ఫలము ఉన్నవారు శక్తికొద్దీ వస్త్ర,ధాన్య,శాకాది,దానాలు చేసుకోవాలి.

గ్రహణ కాలంవరకూ దేవతామూర్తుల మీద ,నిల్వఉండే ఊరగాయ, ధాన్యము, నీరు మొదలైన వాటిలో దర్భ వేసిగ్రహణ అనంతరం తీసి వేయాలి . మరుసటి రోజు దేవతామందిరాన్ని ,దేవతా మూర్తులను శుద్ధపరచుకోవాలి.

గ్రహణసమయంలో దేవతా పూజలు అభిశేకాదులు చేయకూడదు .

ఉపదేశిత మంత్రము కానీ ఏదైనా దేవతానామాన్ని జపిస్తే గణనీయ ఫలము అని శాస్త్రవాక్యము.
గర్భవతులు గ్రహణం చూడరాదు.

English summary

 During lunar eclipse on October 8, one should take few precautions, says astrologer Maruthi Sharma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X